ఇంగ్లీష్ లో మాట్లాడేవారు ఈ రెండేళ్లలో ఏం పొడిచాడు, నేను బ్రహ్మాండంగా గెలవబోతున్నా, జీవితాకు బండ్ల కౌంటర్లు!

First Published Sep 27, 2021, 2:24 PM IST

టాలీవుడ్ లో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోగా, మేమంతా భాయ్ భాయ్ అంటూనే ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న బండ్ల గణేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 


మా బిల్డింగ్ నిర్మాణం అలవి కానీ హామీగా బండ్ల గణేష్ అభివర్ణించారు. మాటలే కానీ ఎలక్షన్స్ తరువాత ఈ హామీలు ఇచ్చినవారు కనిపించరు అన్నారు. గజం మూడు లక్షలు ఖరీదు ఉన్న జూబ్లీ హిల్స్ లో బిల్డింగ్ నిర్మాణం సాధ్యమయ్యే పనికాదన్నారు.మా బిల్డింగ్ అవసరమే లేదన్న బండ్ల గణేష్, కోకాపేట లాంటి ఏరియాలో వంద మంది కళాకారులకు ఇళ్ళు నిర్మించి ఇస్తే సంతోషపడతారు, ఆ పని నేను చేస్తాను అన్నారు. 
 

ఫండ్స్ కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు తిరగాల్సిన అవసరం లేదని, మన టాలీవుడ్ స్టార్స్ తో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి ఒక్కరోజులో రూ. 25కోట్లు రాబట్టగల సత్తా తనకు ఉందని అన్నారు. డెమిగాడ్స్ మన హీరోలు ఉండగా ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని బండ్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ లో ఎవరు గెలిచినా నేను వాళ్ళను ప్రశ్నించేవాడిగా ఉంటాను అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలా వాళ్లపై ఒత్తిడి తెస్తానని తెలియజేశారు. ఎవరు ఏ తాయిలాలు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం తనకే వేయాలని మా సభ్యులకు మీడియా ముఖంగా తెలియజేశారు. 

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ చాలా టైట్ గా ఉందని, ఎవరు గెలిచినా అతను నా అధ్యకుడే అన్నారు. 
పరోక్షంగా తెలుగువారికి సప్పోర్ట్ చేద్దాం అంటూ... మంచు విష్ణుకు తన మద్దతు తెలిపారు బండ్ల గణేష్. 
 

నాకు గొప్ప అండ ఉంది, గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఇంగ్లీష్ మాట్లాడే వారు ఏమి పొడిచారు, కరోనాను అడ్డం పెట్టుకొని తప్పించుకున్నారని, జీవితాను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు. 
 

ఇక ఏపీ గవర్నమెంట్ పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై బండ్ల స్పందించాడనికి నిరాకరించారు. ఆక్టోబర్ 11న ఎన్నికల అనంతరం మాట్లాడతా అన్నారు. ఆ రోజు ప్రతి విషయంపై స్పందిస్తాను అన్నారు. 

click me!