ఆ పర్సనల్ ప్రాబ్లమ్ నుండి బిగ్ రిలీఫ్...   చైతన్యను కాపాడిన పవన్ కళ్యాణ్!

Published : Sep 27, 2021, 10:40 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కినేని నాగ చైతన్యను పెద్ద సమస్య నుండి కాపాడాడు. తన వ్యక్తిగత సమస్యకు తెలియకుండానే కొంచెం ఉపశమనం కలిగించారు. 

PREV
16
ఆ పర్సనల్ ప్రాబ్లమ్ నుండి బిగ్ రిలీఫ్...   చైతన్యను కాపాడిన పవన్ కళ్యాణ్!
pawan kalyan

తన ఒక్క స్పీచ్ తో నాగ చైతన్య, సమంత విడాకులు న్యూస్ మరుగున పడిపోయింది. గత నెల రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న ఈ న్యూస్, రెండు రోజులుగా సద్దుమణిగింది. 


 

26

కారణం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులను సన్నాసులు, వెధవలు అంటూ రెచ్చిపోయారు. పరిశ్రమలోని పెద్దలైన చిరంజీవి, మోహన్ బాబు వంటి వారిని కూడా వదల్లేదు. 

36

మా ఎన్నికల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేశాయి. మంచు విష్ణుకు పోటీదారుగా అధ్యక్షుడు పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ని సమర్ధిస్తూ పవన్ మాట్లాడడం జరిగింది. పరోక్షంగా నా ఓటు ప్రకాష్ రాజ్ కే అని పవన్ తెలియజేశారు. 
 

46


పవన్ వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దల కౌంటర్లు, వైసీపీ మంత్రులు ఎన్కౌంటర్స్ ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. దీనితో నాగ చైతన్య, సమంత విడాకుల గొడవ పక్కనపడేశారు. లవ్ స్టోరీ సక్సెస్ మీట్స్ లో పాల్గొంటున్న నాగ చైతన్యకు పర్సనల్ క్వశ్చన్స్ ఏమి ఆన్సర్ చేయాల్సిన అవసరం రావడం లేదు. 
 

56

పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ తెలుగు రాష్ట్రాలలో ప్రధాన హాట్ టాపిక్ గా మారగా, చైతు, సమంతల టాపిక్ తెరపైకి రావడం తగ్గింది. వ్యక్తిగతంగా, మానసికంగా చైతూకు ఈ విషయం గొప్ప రిలీఫ్ ఇచ్చే అంశం అని చెప్పాలి. ఆ విధంగా పవన్ చైతూని పరోక్షంగా కాపాడారు. 

66

మరోవైపు చైతు, సమంతల వివాహ బంధం పై సందిగ్ధత కొనసాగుతుంది. వేరువేరుగా ఉంటున్న ఈ కపుల్ కలుస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. చైతు నటించిన లవ్ స్టోరీ విడుదలై మూడు రోజులు అవుతున్నా, సమంత కామెంట్ చేయలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories