#SonuSood: సోనూ సూద్ కు షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Published : Feb 07, 2025, 09:05 AM IST

#SonuSood: బ్లాక్ చైన్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో సోనూ సూద్ ఇరుక్కున్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

PREV
14
#SonuSood: సోనూ సూద్ కు షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
Punjab Court Issues Arrest Warrant Against Actor Sonu Sood In Fraud Case


ప్రముఖ నటుడు, సోషల్ వారియర్ గా పేరు తెచ్చుకున్న సోనూ సూద్‌కు పెద్ద షాక్ తగిలింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేయాలనీ పంజాబ్, లుథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్లాక్ చైన్ ఇన్వెస్ట్‌మెంట్లో భాగంగా ఓ కేసులో ఆయన ఇరుక్కున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

24
Punjab Court Issues Arrest Warrant Against Actor Sonu Sood In Fraud Case


ఒక ట్రాన్సిక్షన్ లో సాక్షిగా ఉన్నా సోనూ సూద్ ఆ కేసు విచారణలో హాజరు కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలను పట్టించుకోలేనట్లు సమాచారం. దీంతో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

34
Punjab Court Issues Arrest Warrant Against Actor Sonu Sood In Fraud Case


 పూర్తి వివరాల్లోకి వెళ్తే...  లుథియానా‌కు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా.. మోహిత్ శర్మ అనే వ్యక్తిని రిజికా కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్లో రూ. 10 లక్షలు మోసం చేశాడు. దీనికి సోనూ సూద్ సాక్షిగా ఉన్నాడు.

ఈ క్రమంలోనే మోహిత్ శర్మ పంజాబ్, లుథియానా కోర్టులో కేసు వేయగా విచారణ నేపథ్యంలో సోనూ సూద్ ను కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపించింది. పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసిన ఆయన భేఖాతరు చేయడంతో లుథియానా కోర్టు ఆగ్రహించింది. 

44
Punjab Court Issues Arrest Warrant Against Actor Sonu Sood In Fraud Case


తాజాగా ముంబై, అందేరి వెస్ట్‌లోని ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ సోనూసూద్‌ను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పాటించకపోతే ఉల్లంఘన చట్టం కింద కఠిన చర్యలు తప్పవని వారెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
 

Read more Photos on
click me!

Recommended Stories