DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?

Published : Aug 08, 2026, 09:44 AM IST

DC Box Office Collections: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'DC' సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. అరుణ్ మాధేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలిరోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం.

PREV
14
హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

సౌత్ లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న లోకేష్ కనగరాజ్, 'DC' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో లోకేష్ సరసన సంజన, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. అనిరుధ్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. విపరీతమైన యాక్షన్ సీన్స్ కారణంగా ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ లభించింది.

24
డైరెక్టర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్..
రిలీజ్‌కు ముందు వేసిన స్పెషల్ స్క్రీనింగ్‌లో టాప్ డైరెక్టర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న సినిమా చూసిన ప్రేక్షకులు లోకేష్ నటనను, ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.
34
DC సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్
తాజాగా 'DC' సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయి. ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.5.70 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.4.70 కోట్లు, విదేశాల్లో రూ.1 కోటి కలెక్ట్ చేసింది.
44
వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం
రాష్ట్రాల వారీగా చూస్తే, తమిళ వెర్షన్ రూ.2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో రూ.1.40 కోట్లు, కేరళలో రూ.60 లక్షలు, కర్ణాటకలో రూ.40 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ.30 లక్షలు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read more Photos on
click me!

Recommended Stories