Lock Upp:స్నేహితుడిని ముద్దాడిన విషయం భర్తకు చెప్పాను.. కంగనా షోలో సీరియల్ హీరోయిన్ సంచలన కామెంట్

Published : Mar 21, 2022, 08:14 PM IST

కంగనా రనౌత్ (Kangana Ranaut)హోస్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రసారమవుతున్న లాక్ అప్ రియాలిటీ షో సంచలనాలకు వేదికగా మారుతుంది. ఈ షో కంటెస్టెంట్స్ చేస్తున్న కామెంట్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. తాజాగా కంటెస్టెంట్ నిషా రావల్ పెళ్లి తర్వాత పాత స్నేహితుడికి ముద్దు పెట్టానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.   

PREV
15
Lock Upp:స్నేహితుడిని ముద్దాడిన విషయం భర్తకు చెప్పాను.. కంగనా షోలో సీరియల్ హీరోయిన్ సంచలన కామెంట్


కొద్దిరోజుల క్రితం షో నుండి ఎలిమినేటైన తెహ్సీన్ పూనావాల (Tehseen Punawala)దారుణమైన సీక్రెట్ బయటపెట్టారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త తన భార్యతో శృంగారం చేయాలని తనని కోరాడట. ఆ వ్యాపారవేత్త కోరినట్లు ఆయన భార్యతో నేను శృంగారం చేశాను. దానిని ఆయన దూరంగా చూసి ఎంజాయ్ చేశాడంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. భర్త కోరాడని పెళ్ళైన ఓ మహిళతో శృంగారం చేశానని తెహ్సీన్ చెప్పడం దేశవ్యాప్తంగా న్యూస్ అయ్యింది. తాజాగా మరో కంటెస్టెంట్ అదే తరహా కామెంట్స్ చేసింది. తనకు భర్త ఉండగానే స్నేహితుడిని ముద్దాడినట్లు ఆమె వెల్లడించారు.  

25

  మార్చి 20న ప్రసారమైన జడ్జిమెంట్‌ డే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ నిషా రావల్ (Nisha Rawal)తన రహస్యాన్ని బయటపెట్టింది.కంటెస్టెంట్ మునావర్‌ ఫరూఖీ, నిషా రావల్‌లు తమ జీవితంలోని రహస్యాన్ని బయటపెట్టే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నిషా రావల్‌ మొదటగా బజర్‌ నొక్కడంతో తన సీక్రెట్‌ను ప్రపంచంతో పంచుకోమని హోస్ట్ కంగనా ఆదేశించింది. 
 

35

'నేను కరణ్‌ మెహ్రాను 2012లో పెళ్లి చేసుకున్నాను. 2014లో నాకు గర్భస్రావం అయింది. అ‍ప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. నేను శారీరకంగా, మానసికంగా వేధించే బంధం లో ఉన్నానని అందరికీ తెలుసు. గర్భస్రావం తర్వాత నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక మహిళగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. అప్పుడు నన్ను అనేక మంది అకారణంగా దూషించారు. సెలెబ్రిటీని కావడం వలన నా ఇబ్బందులు ఎవరితోనూ చెప్పుకోలేక పోయాను. ఆ సమయంలో నాకు సప్పోర్ట్ గా నిలిచే వారెవరూ లేరు.

45


2015లో నా కజిన్‌ సంగీత్‌ వేడుకలో నా పాత స్నేహితుడిని కలిశాను. అక్కడ కూడా చాలా మంది నన్ను అవమానించారు. అప్పడు నాకు ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించింది. నాకు ఎవరైనా సపోర్ట్‌గా ఉంటే బాగుండనిపించింది. ఆ సమయంలో మేము కొత్త ఇంటికి మారుతున్నాం. అక్కడ నా పాత మిత్రుడిని చూశాను. చాలా కాలం తర్వాత మేము కనెక్ట్‌ అయ్యాం. అతడు నన్ను సపోర్ట్‌ చేశాడు. నేను అతని పట్ల ఆకర్షితురాలినయ్యాను. అ‍ప్పుడే నేను అతన్ని ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆ విషయం అదే రోజు నా భర్తకు చెప్పాను. మేము అప్పటికే విడిపోవడం గురించి చర్చించుకుంటున్నాం. ఇక ఆ వివాహం బంధంలో నాకు ఉండాలనిపించలేదు. చివరిగా నాకోసం స్టాండ్ తీసుకున్నాను.' అని నిషా రావల్‌ తెలిపింది. 

55


నిషా రావల్ కామెంట్స్ సెన్సేషన్ రేపుతున్నాయి. ఓటిటీ షో కావడంతో మరీ హద్దులు మీరు కంటెస్టెంట్స్ ప్రవర్తిస్తున్నారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోని బీట్ చేయడమే కంగనా (Kanagna Ranaut)లక్ష్యంగా తెలుస్తుంది. కొందరు కంటెస్టెంట్స్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. మొత్తంగా బోల్డ్ కంటెంట్ తో సాగుతున్న షోకి బాగానే ఆదరణ దక్కుతుంది. ఎమ్ ఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీలో ఈ షో 24*7 ప్రసారం అవుతుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుండగా 11 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ షోని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories