RRR Release: ట్రిపుల్ ఆర్ తో మళ్ళీ కళకళలాడబోతున్న థియేటర్లు, సినిమాకు మళ్ళీ పూర్వ వైభవం..

Published : Mar 21, 2022, 09:05 PM IST

థియేటర్ కళకళలాడి చాలా కాలం అయ్యింది.. సినిమా వెలుగు విరజిమ్మి చాలా కాలం  అవుతుంది. ఇండస్ట్రీ జన జాతర చేసుకుని చాలా కాలం అవుతుంది. ఎప్పుడో బాహుబలి టైమ్ లో  థియేటర్లు ఆడియన్స్ తో  ఊపిరి సలపనంతగా కిక్కిరిసి పోయాయి. మళ్ళీ ఆ వైభవం ఆర్ఆర్ఆర్ తో రాబోతుంది.  

PREV
18
RRR Release: ట్రిపుల్ ఆర్ తో మళ్ళీ కళకళలాడబోతున్న థియేటర్లు, సినిమాకు మళ్ళీ పూర్వ వైభవం..

బాహుబలి తర్వాత తెలుగు తెర నుంచి వస్తోన్న భారీ బడ్జెట్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. బాహుబలి  తరువాత అంతలా జనాన్ని ప్రభావింతం చేసిన సినిమా కూడా ట్రిపుల్ ఆర్. కరోనాతో దాదాపు మూడేళ్లుగా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. రిలీజ్ లు లేక థియేటర్లు.. కోలుకోలేని దెబ్బతో విలవిల్లాడాయి. 

28

కరోనా సంక్షోభంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఈ మధ్యలో  ఇంట్లో ఉండి ఓటీటీకి అలవాటుపడ్డారు ఆడియన్స్. దాంతో ఓవర్ ఆల్ గా సింగల్ స్క్రీన్ థియేటర్లు చాలా మూతపడ్డాయి. ఇప్పుడు నడుస్తున్న థియేటర్లలో కూడా మొత్త ఫిల్ అయ్యే సినిమాలు ఇంత వరకూ రాలేదు. వరసగా వారంరోజులు థియేటర్ లు నిండిపోయేలా సినిమాలు రాక చాలా కాలం అయ్యింది. థియేటర్ లో లాక్‌డౌన్‌ ఎత్తేసినా సీ సెంటర్‌లో సింగిల్‌ స్క్రీన్‌ నుంచి మెట్రోలో మల్టీప్లెక్సుల వరకు ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.

38

అయితే ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. తమ అభిమాన స్టార్స్ కోసం థియేటర్లకు జనాలు వస్తున్నారు. కాని నార్త్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండియా వైడ్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్స్ సినిమాలు కూడా సరిగ్గా ఆడటం లేదు. రీసెంట్ గా అక్షయ్‌ కుమార్‌ నటించిన బెల్‌బాటమ్‌, సూర్యవంశీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
 

48

ఇక త్వరలో థియేటర్లకు పూర్వ వైభవం రాబోతోంది. థియేటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోబోతున్నాయి. ఇంత కాలం బుజుపట్టిన థియేటర్లకు కొత్త వెలుగులతో జిల్ జిగేలుమనబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో థియేటర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ విషయం ఓ సర్వేలో తేలింది.  

58

సోషల్‌ మీడియాలో లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వే సినిమా ఇండస్ట్రీకి శుభవార్త చెప్పింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 331 జిల్లాల నుంచి 19 వేల మందికి పైగా సినిమా గోయర్స్‌ నుంచి చాలా సార్లు  సమాచారం సేకరించి విశ్లేషించి రిజల్ట్ ను రిలీజ్ చేశారు.  ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
 

68

2021 డిసెంబరులో సేకరించిన సమాచారం ప్రకారం గత 60 రోజుల్లో సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశామని చెప్పిన వాళ్ల సంఖ్య 14 శాతం ఉండగా 2022 ఫిబ్రవరి నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఇక సినిమాలకు కీలకమైన మార్చ్‌, ఏప్రిల్‌లలో థియేటర్‌కి వెళ్లి కచ్చితంగా సినిమా చూస్తామని చెప్పిన వారి సంఖ్య ఏకంగా 41 శాతంగా ఉంది. 
 

78

లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం సినిమా గోయర్స్‌లో 75 శాతం మంది ఏడాది కాలంగా థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడలేదు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా వస్తే థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. అంతే కాదు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ కంటెంట్‌ బాగుంటే థియేటర్లలో కనకవర్షమే అనే  అంచనాలు నెలకొన్నాయి. 
 

88

పైగా లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో 44 శాతం శాంపిల్స్‌ మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల నుంచి తీసుకున్నారు. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రోజులు హౌజ్‌ఫుల్‌ బోర్డులు పడితే  పాత సినిమాల రికార్డ్ లు బద్దలు కొట్టడం ఖాయాం అంటున్నారు.  అయితే ఆ సత్తా ట్రిపుల్ ఆర్ కు ఉంది  అని కొన్ని సర్వేలు చెపుతున్నాయి.   
 

click me!

Recommended Stories