RRR థియేటర్లలో కంచెలు, ఇనుప మేకులు.. ఎందుకో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌.. `పుష్ప` ఎంత పనిచేసింది!

Published : Mar 21, 2022, 08:43 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మానియా సాగుతుంది. ఎక్కడ చూసినా `ఆర్‌ఆర్‌ఆర్‌` పదే మారుమోగుతుంది. అయితే థియేటర్ హోనర్లు మాత్రం అభిమానులకు షాకిస్తున్నారు. ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. 

PREV
18
RRR థియేటర్లలో కంచెలు, ఇనుప మేకులు.. ఎందుకో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌.. `పుష్ప` ఎంత పనిచేసింది!

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కోసం యావత్‌ ఇండియా వెయిట్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం ఎంతో మంది ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అనేక అవాంతరాలను, వాయిదాలను దాటుకుని ఈ చిత్రం ఎట్టకేలకు ఈ మార్చి 25న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్ సైతం ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు. రోజు రోజుకి ఆతృత పెరుగుతుంది. మరోవైపు సినిమా ఆన్‌లైన్‌ బుకింగ్స్ చేయగా, ఇప్పటికే ఫుల్‌ అయిపోయాయి. చాలా థియేటర్లలో టికెట్లు దొరకడం లేదు. మరోవైపు బెనిఫిట్‌ షోల టికెట్‌ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఒక్కో టికెట్‌ ధర ఐదు వేల వరకు పలుకుతుందని సమాచారం. 

28

ప్రస్తుతం ఇందులో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి దేశ వ్యాప్తంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే కర్నాటక, హైదరాబాద్‌, దుబాయ్‌, ఢిల్లీ, వారణాసి ఏరియాలను కవర్‌ చేశారు. ప్రస్తుతం జైపూర్‌లో ఈవెంట్‌ లో పాల్గొన్నారు. మరో రెండు రోజుల వరకు క్షణం తీరిక లేకుండా ప్రమోషన్‌లో పాల్గొనబోతున్నారు `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. 

38

ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఇద్దరు సూపర్‌ స్టార్లు నటించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ఇద్దరు రెండు పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన హీరో. నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇద్దరు సూపర్‌ స్టార్‌ అభిమానులంటే తొలి రోజు తొలి షో చూడాల్సిందే. అంతేకాదు ఇద్దరు హీరోల అభిమానులు ఎవరికి వారు తగ్గేదెలే అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్లలోనూ వారి అభిమానులు తమ సత్తాని చాటుకుంటున్నారు. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని నిరూపించుకుంటున్నారు. 
 

48

అరుపులు, కేకలతో తమ హీరోకి ఉన్న ఫాలోయింగ్‌ని చాటి చెబుతున్నారు. అయితే పలు ఈవెంట్లలో ఎన్టీఆర్‌ డామినేషన్‌ కనిపిస్తుందంటున్నారు. అంతేకాదు ఆయన మాట్లాడే సమయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో అరుపులు, కేకలు చేయడంతో ప్రాంగణాలు మారుమోగిపోతున్నాయి. ఓ రకంగా రామ్‌చరణ్‌ అభిమానుల్ని డామినేట్‌ చేస్తున్నారు. దీంతో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఓ రకమైన ఈగో క్లాషెస్‌ చోటు చేసుకుంటున్నాయి. పైకి ఎంత కలిసి ఉన్నామని చెప్పుకుంటున్నా, లోలోపల రగిలిపోతున్నారు. టైమ్‌ వచ్చినప్పుడు తమ హీరో ప్రభావాన్ని చాటుకోవాలని కసితో ఉన్నారు. 

58

అయితే ఈ విషయాన్ని ఊహించి చాలా వరకు ఏరియాల్లో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి సెపరేట్‌గా థియేటర్లని ఏర్పాటు చేస్తున్నారు. అయినా చాలా థియేటర్లలో హంగామా మూములుగా ఉండదు. అభిమానుల తాకిడిని అడ్డుకోవడం థియేటర్ ఓనర్లకి కత్తిమీద సాములాంటిది. దీంతో థియేటర్లకి డ్యామేజ్‌ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమా సమయంలో అభిమానులు థియేటర్‌ స్క్రీన్‌ ఎక్కి గోల చేశారు. అంతేకాదు స్క్రీన్లని కూడా చించేశారు. దీంతో అది పెద్ద రచ్చ అయ్యింది. థియేటర్‌కి చాలా నష్టం వాటిల్లింది. 

68

ఒక్క హీరో సినిమాకే అలా ఉంటే, ఇక ఇద్దరు హీరోలు నటించిన సినిమా, పైగా ఈగో క్లాషెస్‌ ఉండటంతో థియేటర్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుందో అని ఊహించిన పలువురు థియేటర్‌ ఓనర్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రీన్‌పైకి ఎక్క కుండా, తెరకి, సీట్లకి మధ్య ఉన్న గ్యాప్‌లో ఇనుప కంచెలు, ఇనుప మేకులు అమర్చుతున్నారు. దాన్ని దాటుకుని తెర వద్దకి వెళ్లేందుకు అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

78

అయితే దీనిపై మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. అభిమానాన్ని ఈ రూపంలో అడ్డుకుంటారా? ఇది అన్యాయం అంటున్నారు. మరి దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు తమ అభిమానాన్ని ఎవరూ ఆపలేరని, తాము ఇనుప చెప్పులు వేసుకుని వస్తామని మీమ్స్ చేయడం ఓ విశేషమైతే, ఈ రకంగా తమని దెబ్బకొడుతున్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా థియేటర్‌ ఓనర్ల జాగ్రత్తలు ఇప్పుడు విమర్శల పాలవుతున్నాయి. `పుష్ప` సినిమా ఎంత పని చేసిందంటున్నారు.

88

ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డివివి దానయ్య దాదాపు రూ.480కోట్లతో నిర్మించారు. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ కథానాయికలుగా నటించారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. `బాహుబలి` రికార్డ్ లను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుందీ సినిమా. మరి దాన్ని మించుతుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories