Liger Review: లైగర్‌ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. విజయ్‌ దేవరకొండకి దెబ్బ మీద దెబ్బా?

First Published | Aug 25, 2022, 5:04 AM IST

విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లైగర్`. పాన్‌ ఇండియా తరహాలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 25) విడుదలవుతుంది. మరి సినిమా ఎలా ఉందనేది సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. `లైగర్‌` ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. 

విజయ్‌ దేవరకొండ,  డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `లైగర్‌`. పూరీ మార్క్ హీరో క్యారెక్టరైజేషన్‌కి, విజయ్‌ దేవరకొండ పర్‌ఫెక్ట్ సూట్‌ అవుతాడని చెప్పొచ్చు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించడంతో మరింత స్పెషల్‌గా మారింది. పాన్‌ ఇండియా తరహాలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 25) విడుదలవుతుంది. మరి సినిమా ఎలా ఉందనేది సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. `లైగర్‌` ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. Liger Twitter Review.
 

`లైగర్‌` సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా కావడం,  పూరీ `ఇస్మార్ట్ శంకర్‌` తర్వాత చేస్తున్న మూవీ కావడం, వరుస పరాజయాల అనంతరం కూడా విజయ్‌ తో ఇంతటి భారీ పాన్‌ ఇండియా సినిమా చేయడం విశేషం. పైగా బాలీవుడ్‌ ఫిల్మ్  మేకర్‌ కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించడం, అనన్య పాండే హీరోయిన్‌గా చేయడం, ప్రపంచ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించడం, తెలంగాణ కుర్రాడి జర్నీని ఆవిష్కరించే సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలున్నాయి. 


`లైగర్‌` సినిమా ప్రీమియర్స్ అమెరికాలో ఇప్పటికే పడ్డాయి. వాటి రిజల్ట్ వచ్చింది. ఈ ప్రీమియర్స్ ద్వారా నెటిజన్లు సినిమా ఎలా ఉందో ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి ప్రధానంగా నెగటివ్‌ టాక్‌ వస్తోంది. సినిమా అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉందని అంటున్నారు. విజయ్‌ దేవరకొండ లాంటి హీరోతో పూరీ ఓ చెత్త సినిమా చేశాడని కామెంట్లు పెడుతున్నారు. ఓ పొటెన్షియల్‌ మూవీని అర్థరహితంగా  రాయడం వల్ల, అంతగా వాల్యూ లేని సన్నివేశాల ద్వారా వృధా చేశారని చెబుతున్నారు.
 

కానీ విజయ్‌ దేవరకొండ బాడీ ట్రాన్స్  ఫర్మేషన్‌ బాగుందని, నటుడిగా తన  బెస్ట్ ఇచ్చాడని, సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుందన్నారు. అదే  సమయంలో హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ చాలా దారుణంగా ఉందట. మొదటి భాగంలో కొన్ని ఎలివేషన్‌ సన్నివేశాలు బాగున్నాయట. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నాయి తప్పితే, సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదంటున్నారు. 
 

మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ మాత్రం చాలా దారుణంగా ఉందంటున్నారు. పూర్తిగా నిరాశ పరుస్తుందని చెబుతున్నారు. క్లూలెస్‌ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా నెగటివ్‌ సైడ్‌ టర్న్ తీసుకుంటుంది. పూరీ `లైగర్‌` సినిమాతో ఓ గొప్ప ఛాన్స్ ని మిస్‌ చేసుకున్నారని చెబుతున్నారు. అధ్వానమైన రచన, భయంకరమైన స్క్రీన్‌ ప్లే ఆడియెన్స్ తో ఆడుకుంటుందని, క్లైమాక్స్ మరీ డిజప్పాయింట్‌ చేస్తుందట. సినిమాలో అసలు కథే లేదని, కేవలం స్క్రీన్‌ప్లే, మాంటేజ్‌లు మాత్రమే ఉన్నాయని, దీంతో విజయ్‌ దేవరకొండ కూడా చేయడానికి ఏం లేదని అంటున్నారు.

హీరో క్యారెక్టరైజేషన్‌, డైలాగ్‌లు పూరీ జగన్నాథ్‌ బలాలు. ఇందులో అవే మిస్‌ అయ్యాయని, మైక్‌ టైసన్ పాత్రని  కామెడీగా మార్చేశారని, రమ్యకృష్ణ  ప్రయత్నం వృధానే అంటున్నారు. సినిమా ఏ టైమ్‌లో ఎటువెళ్తుందో అర్థంకాని అయోమయం  ఆడియెన్స్ ది అని అంటున్నారు. సినిమా బాగా లేనప్పుడు సినిమాని బైకాట్‌ చేయాలనే పోస్ట్  లు పెడుతుంటారు. దీనికి ఆ పోస్టులు పెట్టినా టైమ్‌ వేస్టే అని చెప్పడం గమనార్హం.  విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా ఎంట్రీకిది మంచి ఛాయిస్ కాదని, దర్శకుడు పూరీ విజయ్‌ని ముంచేశాడని, దెబ్బ మీద దెబ్బతో విజయ్‌కి కోలుకోలేని దెబ్బనే అని అంటున్నారు. మరి ట్విట్టర్‌ పోస్ట్ లు చాలా వరకు నెగటివ్‌గా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందనేది `ఏషియానెట్‌` పూర్తి రివ్యూలో మరికాసేపట్లో తెలుసుకుందాం. 

Latest Videos

click me!