కెరీర్ లో మొదటిసారి విజయ్ (Vijay devarakonda) ఫైటర్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా పలు బాషలలో విడుదల కానున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.
కాగా ఎవరూ ఊహించని విధంగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్,లెజెండ్ మైక్ టైసన్ లైగర్ మూవీలో నటిస్తున్నారు. మైక్ టైసన్ నటిస్తున్న మొదటి ఇండియన్ మూవీ లైగర్ కావడం మరో విశేషం.కాగా ప్రస్తుతం లైగర్ (Liger) షెడ్యూల్ అమెరికాలో జరుగుతుంది.
కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరపనున్నారు. కాగా ఈ షెడ్యూల్ నందు మైక్ టైసన్ పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండ, టైసన్ మధ్య భీకర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.
ఇక చిత్ర యూనిట్ మొత్తం లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఫోటోలు దిగారు. దర్శకుడు పూరి జగన్నాధ్ (Puri jagannadh) , నిర్మాత ఛార్మి, హీరోయిన్ అనన్య పాండే (Ananya pandey)ఆయనతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. మైక్ టైసన్ సైతం లైగర్ టీం తో చాలా ఉల్లాసంగా కనిపించారు.
ఇక హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తన అందం తెలియజేశారు.. ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఓ జ్ఞాపకంగా వర్ణించారు. వాటిలో ఇది మరింత స్పెషల్ అంటూ... ఓ ఫోటో షేర్ చేశారు. కాగా వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ తో విజయ్ పోరాటాలు ఎలా ఉంటాయో చూడాలనే ఆత్రుత అందరిలో మొదలైపోయింది.
లైగర్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లైగర్ అనంతరం విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో మూవీ ప్రకటించారు. అలాగే నిర్మాతగా వరుస చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.