మరో యంగ్‌ హీరోతో డేటింగ్‌లో `లైగర్‌` హీరోయిన్‌ ? కొత్త బాయ్‌ ఫ్రెండ్‌తో దీపావళి పార్టీలో హల్‌చల్‌

Published : Oct 22, 2022, 09:22 AM IST

`లైగర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అనన్య పాండే. మరోవైపు తన పిచ్చెక్కించే హాట్‌ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషనల్‌ స్టార్‌గా నిలిచింది. ఇప్పుడు డేటింగ్‌ రూమర్స్ తో చర్చల్లో నిలుస్తుంది.  

PREV
18
మరో యంగ్‌ హీరోతో డేటింగ్‌లో `లైగర్‌` హీరోయిన్‌ ? కొత్త బాయ్‌ ఫ్రెండ్‌తో దీపావళి పార్టీలో హల్‌చల్‌

అందాలు ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతుంది అనన్య పాండే. కెరీర్‌ బిగినింగ్‌లోనే ఈ బ్యూటీకి ఊహించిన క్రేజ్‌ వచ్చింది. అందుకు ఆమె చేస్తున్న సినిమాలతోపాటు ఆమె సోషల్‌ మీడియా కోసం ఇస్తున్న సెక్సీ ఫోటో షూట్లు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. 

28

ఇదిలా ఉంటే ఇప్పుడు లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ విషయంలోనూ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ బాయ్‌ ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పింది అనన్య పాండే. ఇషాన్‌ ఖట్టర్‌తో కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసింది. ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఘాటు రొమాన్స్ లో మునిగి తేలారు. ఆయనకు ఆ మధ్య బ్రేకప్‌ చెప్పింది. తాను ఇప్పుడు సింగిల్‌ అని ఇషాన్‌ ఆ మధ్య కరణ్‌ టాక్‌ షోలో తెలిపిన విషయం తెలిసిందే. 
 

38

ఇంతలోనే మరో యంగ్‌ బాలీవుడ్‌ హీరోతో కనిపించి షాకిచ్చింది. బాలీవుడ్‌ నిర్మాత మనీష్‌ మల్హోత్రా దివాళీ బాష్‌ పార్టీ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు. అయితే ఈ నైట్‌ పార్టీ కోసం అనన్య పాండే బాలీవుడ్‌ యంగ్‌ హీరో అదిత్య రాయ్‌ కపూర్‌తో కలిసి రావడం విశేషం. 
 

48

ఆదిత్య రాయ్‌, అనన్య పాండే కలిసి కెమెరాకి పోజులిచ్చారు. అయితే ఫోటో షూట్‌ కి ఆదిత్య ముందు రాగా, ఇంకా రావడం లేదంటూ ఆదిత్య ఆమెని పిలిచాడు. దీంతో ఆయనతో కలిసి చేరింది. కలిసే ఫోటోలకు పోజులిచ్చింది. 
 

58

ఈ సందర్భంగా వీరిద్దరు చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. ఫోటో సెషన్‌ అనంతరం ఇద్దరు కలిసి లోపలికి వెళ్లిపోయారు. అయితే అందులో వీరిద్దరు చాలా చనువుగా మూవ్‌ అవ్వడంతో డేటింగ్‌ రూమర్స్ ఊపందుకున్నాయి. కొత్త లవ్ కపుల్‌ అంటూ బాలీవుడ్‌ మీడియా గాసిప్‌లు స్టార్ట్ చేసింది. 

68

ప్రస్తుతానికి ఈ జంట లవ్‌ బిగినింగ్‌ స్టేజ్‌లోనే ఉందని, మున్ముందు అది బలపడే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా రాసుకొస్తుంది. దీంతో ప్రస్తుతం `లైగర్‌` బ్యూటీ డేటింగ్‌ రూమర్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మరి దీనిపై అటు ఆదిత్య గానీ, ఇటు అనన్య గానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. 

78

ఇదిలా ఉంటే ఇటీవల పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. మూడేళ్ల క్రితం `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య పాండే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖాలీ పీలి`, `గెహ్రైయాన్‌` చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం `కో గాయే హమ్‌ కహన్‌`, `డ్రీమ్‌ గర్ల్ 2` చిత్రాల్లో నటిస్తుంది. 
 

88

2009లో `లండన్‌ డ్రీమ్స్`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య రాయ్‌ కపూర్‌ `ఆషిఖీ 2` చిత్రంతో స్టార్‌ అయిపోయాడు. `యే జవానీ హై దీవానీ`, `దావత్‌ ఈ ఇష్క్`, `ఫిటూర్‌`, `ఓకే జాను`, `ఖలంక్‌`, `మలంగ్‌`, `సడక్‌ 2`, `లుడో`, `రాష్ట్ర కవచ్‌ ఓం` చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం `గుమ్రా` చిత్రంలో నటిస్తున్నారు ఆదిత్యరాయ్ కపూర్. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories