Karthika Deepam: దుర్గ వల్ల ఇరుక్కుపోయిన మోనిత.. శౌర్యని వెతికే ప్రయత్నంలో దీప!

Published : Oct 22, 2022, 08:33 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 22వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: దుర్గ వల్ల ఇరుక్కుపోయిన మోనిత.. శౌర్యని వెతికే ప్రయత్నంలో దీప!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దీప, ఇంట్లో డాక్టర్ బాబు ఉన్నట్టు మోనితని నమ్మిస్తూ, డాక్టర్ బాబు మా మోనిత మాటలు మీరే విన్నారు కదా నేనే తన భార్యని అని ఒప్పుకున్నది అని అరుస్తుంది. దానికి మోనిత కంగారుపడుతూ లేదు కార్తీక్ ఈ వంటలక్క అబద్ధం చెప్తుంది నన్ను మోసం చేసింది. నేనే నీ భార్యని అని మోనిత అంటుంది. దానికి దీప నవ్వుతూ ఎలా భయపడిపోతున్నావో చూడు.డాక్టర్ బాబు లోపల లేరు. దీనికే ఇలా భయపడిపోతున్నవు నువ్వు డాక్టర్ బాబు భార్యగా నా హక్కు పోకొడతావా? నువ్వు ఎంత నటించినా డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేంత వరకు మాత్రమే. ఒకసారి గతం గుర్తొచ్చిన తర్వాత నీ స్థానం నువ్వే చూసుకో అని మోనితతో అంటుంది దీప. ఆ తర్వాత సీన్లో, కార్తీక్ శౌర్య గొంతు వినబడిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ ఎక్కడికి వెళ్లి పోయావు శౌర్య నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ఆలోచిస్తూ ఇంటి వరకు వస్తాడు. 

28

అప్పటికే మోనిత హాల్లో కూర్చుంటూ కార్తీక్ ని ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లి పోవాలి. ఒకవేళ ఏమైనా గట్టిగా మాట్లాడితే దుర్గ తో లింకు పెడుతున్నాడు అసలు ఏం చేయాలి అని అనుకుంటుంది. అదే సమయంలో ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు కానీ మోనితకి ఆ ఏడుపు వినబడదు. ఇంటి బయట ఉన్న కార్తిక్ కి ఏడుపు వినబడి వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ని బుజ్జగిస్తూ, అసలు నీకు బుద్ధి ఉన్నదా మోనిత ఇంట్లో బాబు ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం ఆలోచనలలో ఉన్నావు అని తిడతాడు. నిజంగానే వినిపించలేదు కార్తీక్ ఏదో ఆలోచనలో ఉన్నాను అని మోనిత అనగా, దుర్గ గారు ఇంట్లో ఉన్నారా దుర్గ గారు! దుర్గ గారు! అని అరుస్తాడు కార్తీక్. దుర్గ ఇక్కడ ఎందుకు ఉంటాడు కార్తీక్ అని మోనిత అడగగా, అందుకే నువ్వు పరజ్ఞానంలో ఉన్నావు. దుర్గ లేనప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు అని అనగా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు కార్తీక్.

38

నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ప్రతిసారి నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అసలు ఎలా వస్తావో అని భయమేసేది. ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తే ఎలా అనుమానిస్తున్నావో అని భయంగా ఉన్నది నేను ఆలోచిస్తుంది నీ గురించి నా మైండ్ ఆబ్సెంట్ అయింది. నువ్వు నన్ను అంత అనుమానంగా చూస్తుంటే నా బుర్ర పని చేయడం లేదు  నన్ను అంత అనుమానించొద్దు కార్తీక్ అని మోనిత అరుస్తుంది. దానికి కార్తీక్, అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో శివ, దీప ఇంటి నుంచి మోనిత ఇంటికి వస్తూ, ఏంటో ఉదయం అక్కడ సేవలు చేయాలి రాత్రి వంటలక్క ఇంటి ఎదురుగుండా పడుకోవాలి ఉద్యోగాలు రెండుగాని జీతం మాత్రం ఒకటే అని మోనిత దగ్గరికి వస్తాడు శివ. ఎక్కడికి వెళ్లావు వంటలక్క దగ్గరికి ఎందుకు వెళ్లావు అని మోనిత అడగగా,అటువైపు నుంచే వస్తున్నాను జాగింగ్ కి వెళ్ళాను మేడం అని ఆవలించుకుని శివ చెప్తాడు.

48

జాగింగ్ కి వెళ్తే ఆవలింతలు రావు నిజం చెప్పు ఎక్కడికి వెళ్లావు? నువ్వు ఎక్కడికి వెళ్లావు తెలుసుకోవడం నాకు అంత పెద్ద పని కాదు కానీ నీ నోటితో నువ్వే చెప్పు అని మోనిత అంటుంది.దానికి శివ, కార్తిక్ సారే నన్ను దీపక్క ఇంటి దగ్గర కాపలాగా ఉండమన్నారు అని అంటాడు శివ. దానికి మోనిత ఆశ్చర్య పోతుంది. ఈ మధ్య కార్తీక్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎక్కువ సేపు ఉంటున్నాడు దీప దగ్గరే ఉంటున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు పైగా వంటలక్క కి రక్షణ కూడా ఇస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దుర్గ అక్కడికి వస్తాడు. కొంచెం పాలు ఇవ్వు మోనిత అని అడగగా, నీకు పాలు కాదురా విషం ఇవ్వాలి అని మోనిత అంటుంది. నువ్వు విషం ఇచ్చినా అమృతమే అని దుర్గ అంటాడు. నిజంగానే ఏదో ఒక రోజు నీకు విషం ఇవ్వాలి రా అప్పుడు గానీ  దరిద్రం వదలదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత.
 

58

 ఆ తర్వాత సీన్లో కార్తీక్, బాబుని ఉయ్యాలలో పడుకోబెడుతూ నీది ఎంత మంచి మనసు దీప ఆనంద్ మోనిత బిడ్డ అని తెలిసిన సరే శౌర్య ని, హిమ ని పెంచినంత ప్రేమతోనే ఆనంద్ ని కూడా పెంచావు ఎక్కడున్నావు రౌడీ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ గొంతు వినిపించినా సరే నిన్ను పట్టుకోలేకపోయాను ఎలాగైనా నేను కనిపెట్టాలి అని అనుకుంటాడు. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి కాఫీ కావాలా కార్తీక్ అని అడుగుతుంది. దుర్గకి ఇచ్చావా అని కార్తీక్ అడగగా, మళ్లీ ఎందుకు మొదలు పెడుతున్నావ్ కార్తీక్ వాడు నాకు ఏమవుతాడని నేను వాడికి కాఫీలు ఇవ్వడానికి అని అంటుంది మోనిత. మీ బంధువే కదా ఏదో పరాయి వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి అని కార్తీక్ అంటాడు. దానికి  మోనిత, వాడు నాకు బంధువు కాదు కార్తీక్ వాడు ఒక రౌడీ గాడు వాడికి నేను కాఫీలు ఇవ్వాల్సిన పనిలేదు అని అంటుంది. 

68

ఇంతలో దుర్గ అక్కడికి కాఫీ కప్పు పట్టుకొని వచ్చి థాంక్స్ మోనిత చాలా బాగా కాఫీ పెట్టావు కేవలం నా కోసమే సమయం తీసుకొని మరి కాఫీ పెట్టావు అని అనగా కార్తీక్ నవ్వుతాడు. కార్తీక్ వీడి మాటలు నమ్మొద్దు,వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని మోనిత అంటుంది. కానీ కార్తీక్ నమ్మకుండా నాకు నీ మీద జాలేస్తుంది మోనిత అని అంటాడు.దానికి దుర్గ, అయినా మీకు ఇవ్వలేదా  కాఫీ. నాకు స్పెషల్గా ఇచ్చింది అని అనగా, ఇందాక నీ మీద జాలేస్తుంది అని చెప్పాను కదా మోనిత లేదు నా మీద జాలేస్తుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడు మోనిత దుర్గతో, ఎందుకురా నా జీవితాన్ని ఇలా సాధిస్తున్నావు అని ఏడుస్తూ అనగా ఎందుకు మోనిత ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నా సరే నీ దగ్గర నుంచి వచ్చేది విషపు చుక్కలు మాత్రమే ఎందుకంటే నీ ఒళ్ళంతా విషయమే ఉన్నది. దాన్ని సంగతి కూడా నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దుర్గ. ఆ తర్వాత సీన్లో దీప ఇంటి బయట బట్టలు ఆరేస్తూ, ఆరోజు దసరాలో ఒక అతను తన కూతుర్ని చూడమని పిలిచారు.
 

78

అదే రోజు నాకు శౌర్య గొంతు వినిపించింది. నిజంగా అది శౌర్య ఎనా? పైగా ఆటో వెనుకాతల అమ్మ నాన్న ఎక్కడున్నారు అని రాసి ఉన్నది నిజంగా శౌర్య ఈ ఊర్లోనే ఉంటే నేను ఆరోజు అనవసరంగా తప్పు చేశాను పాపం డాక్టర్ బాబుని  వెతికే కంగారులో వాళ్ల మీద అరిచాను ఫీలై ఉంటుందేమో.ఒకవేళ అది సౌర్యే అయితే వెతకాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత, కార్తీక్ ని ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లి పోవాలి ఒకవేళ తీసుకెళ్లాలి అంటే దుర్గ గాడు కూడా మధ్యలో ఉన్నాడు ఏం చేయాలి అని అనుకుంటుంది. మరోవైపు దీప సందులన్నీ వెతుకుతూ శౌర్య ఆటో కోసం గాలిస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడున్న పాప్కార్న్ కొట్టు దీపకి కనిపిస్తుంది. శౌర్యకి పాప్కార్న్ అంటే ఎంత ఇష్టమో ఎక్కడ ఉన్న ఆపేది అని అనగా అదే సమయంలో కార్తీక్ ఆ కొట్టులో కొనుక్కొని తిరిగి చూసేసరికి అక్కడ దీప ఉంటుంది. 

88

మీరు ఇది ఎందుకు కొంటున్నారు డాక్టర్ బాబు అని దీప అడగగా, ఏమో వంటలక్క చూసిన వెంటనే కొనాలనిపించింది గతం మర్చిపోయాను కదా నాకు గతంలో నాకు ఇది ఇష్టమేమో. లేకపోతే నాకు ఇష్టమైన వాళ్లకు ఇష్టమేమో అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప, నా శౌర్యకు కూడా పాప్ కార్న్ అంటే ఇష్టమే అని అంటుంది. దానికి కార్తీక్ మనసులో, నువ్వు చెప్తున్నావు నేను చెప్పలేకపోతున్నాను అంతే దీప అని అనుకుంటాడు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దీప ని కార్తీక్ అడగగా శౌర్య కోసం వెతుకుతున్నాను అని దీప అంటుంది. అప్పుడు కార్తీక్  ఆత్రుతతో, శౌర్య ఇక్కడే ఉన్నదా నీకు కనిపించిందా అని అడగగా, లేదు శౌర్య గొంతు వినిపించింది అలాగే ఆటో వెనుకాటల అమ్మ నాన్న ఎక్కడ అని కూడా రాసి ఉంటుంది అందుకే వెతుకుతున్నాను అని దీప అంటుంది. అదే సమయంలో శౌర్య ఇంకొక ఆటో వాడితో ఆటోలో వెళుతూ వీళ్ళిద్దరిని దాటుతుంది. అప్పుడు దీప శౌర్య నీ చూసి శౌర్యా! అని అరుస్తుంది. కానీ ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సౌర్య ఎక్కడున్నది అని కార్తీక్ అడగగా ఆటోలో కనిపించింది డాక్టర్ బాబు అని అంటుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories