కరోనా పుణ్యమా అని సినిమా కథల్లో చాలా మార్పులు వస్తున్నాయి. రెగ్యూలర్ స్టోరీస్‌ని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపించడం లేదు. చిన్న సినిమాల విషయంలో ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. పెద్ద స్టార్ల సినిమాలు చూస్తున్నారు. ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకు బ్రహ్మారథం పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా లవ్, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన `లెహరాయి` చిత్రం శుక్రవారం విడుదలైంది. రంజిత్, సౌమ్య మీనన్ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. పదికిపైగా చిన్న చిత్రలు డిసెంబర్9న విడుదలయ్యాయి. మరి వాటిలో `లెహరాయి` స్పెషల్‌గా నిలిచింది. ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
డాక్టర్ వృత్తిలో ఉన్న రావు రమేష్ కి కూతురు సౌమ్య మీనన్ అంటే ప్రాణం. కూతురు పై ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని మరో సంతానం కూడా వద్ధనుకుంటాడు. ఓ రోజు ఓ అమ్మాయి ప్రేమలో విఫలం అయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఘటనకి చలించిపోయిన రావు రమేష్ తన కూతురు నుంచి తనకు అలాంటి పరిస్థితి రాకూడదని కూతురితో ప్రామిస్ చేయించుకుంటాడు. జీవితంలో తనకంటూ ఓ గోల్ ఫిక్స్ చేసుకుంటుంది. దీంతో కాలేజ్‌లో ఎంత మంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తుంది. అలానే లోకల్ రౌడీ గగన్ విహారి ఆమెకి ప్రపోజ్ చేయగా రిజెక్ట్ చేస్తుంది. అదే సమయంలో కాలేజ్‌కి కొత్తగా వచ్చిన హీరో రంజిత్ సైతం ఆమె అందానికి ఫిదా అవుతాడు. తన లవ్‌ని ప్రపోజ్ చేస్తాడు. ఆమె చేత ఐ లవ్యూ చెప్పించుకోవాలనుకుంటాడు. మరోవైపు గగన్ విహారి తనని లవ్ చేయాలని సౌమ్య మీనన్‌ని బలవంతంగా చేస్తుంటాడు. ఆ సమయంలో షీ టీమ్ వాళ్లు అతని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైలు నుంచి తిరిగొచ్చిన గగన్‌ని మరోసారి ఆమెపై ఒత్తిడి తీసుకురాగా, అతన్నుంచి తప్పుంచుకునేందుకు రంజిత్‌ని ప్రేమిస్తున్నట్టు అబద్దం చెబుతుంది. రంజిత్ ఆమెపై ప్రేమని మరింత పెంచుకుంటాడు. కానీ అతనిపై ప్రేమ లేదని చెప్పేందుకు సౌమ్య, ఆమె తండ్రి రావు రమేష్ ఏం చేశారు? సారీ చెబితే రంజిత్‌కి ఎందుకు నచ్చదు?. సౌమ్య, రంజిత్ ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది, మొదట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి, రంజిత్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం, యాక్షన్ అంశాలు మేళవించిన చిత్రమిది. ఓ రకంగా రెగ్యూలర్ కమర్షియల్ మూవీనే. కానీ దీన్ని తెరకెక్కించిన తీరు, దాన్ని నడిపించిన తీరే ఈ సినిమాకి ముఖ్యం. ఎంత ఆసక్తికరంగా, ఎంత బోర్ కొట్టకుండా తీశారనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కథ రొటీన్‌గానే సాగినా బోర్ ఫీల్ లేకుండా కథని నడిపించిన తీరు బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. అదే సమయంలో తండ్రి, కూతుళ్ళ మధ్య సెంటిమెంట్, తండ్రి పరువు కోసం కూతురు ప్రేమకి దూరం అవడం రొటీన్ గా అనిపించింది. మరోవైపు విలన్ నుంచి తప్పించుకునేందుకు హీరో నీ వాడుకునే కాన్సెప్ట్ కూడా రెగ్యులర్ గానే ఉంటుంది. దాన్ని తీసుకెళ్లిన తీరు పర్వాలేదు. కథ రెగ్యులర్‌గా ఉండడం, స్లోగ సాగడంతో ఫస్ట్ ఆఫ్ కాస్త బోర్ ఫీల్ తెప్పిస్తుంది.
సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది. కథలో డ్రామా యాడ్ కావడంతో నెక్స్ట్ ఎం జరుగుతుందనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. అయితే తన ప్రేమకి సంబంధించి హీరోకి నిజం చెప్పాలని హీరోయిన్, ఆమె తండ్రి రావు రమేష్ చేసే ప్రయత్నాలు విఫలం కావడం కొంత ఎంటర్టైనింగ్ గా, మరి కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా మారుతుంది. హీరో అలా behave చేయడానికి కారణం ఎంటి. హీరోయిన్ మోసం తెలిసి హీరో heart break కావడం ఎమోషనల్ గా మార్చేశాయి. కమెడీయన్లు రామ్ ప్రసాద్, సత్యం రాజేష్, అలీ comedy నవ్వులు పోయిస్తుంది. కామెడీకి ఇంకా స్కోప్ ఉంది. ఆ దిశగా డైరెక్టర్ ఫోకస్ పెట్టాల్సింది. హీరో sorry చెబితే సీరియస్ కావడం అంతగా పండలేదు. అదే సమయంలో కొత్త హీరోకి స్టార్ హీరో రేంజ్ ఫైట్లు పెట్టడం కూడా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ లవ్ విషయంలో పడే కన్ఫ్యూజన్ కూడా ఆడియన్స్ కి కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ మోసం చేసినప్పుడు వచ్చే సీన్లతో సినిమా అయిపొనట్లు అనిపిస్తుంది. తర్వాత మళ్లీ కంటిన్యూ కావడం రెండు క్లైమాక్స్ లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.
నటీనటులుః
రంజిత్ అప్ కమింగ్ హీరో. హీరోయిజం సన్నివేశాల్లో బాగా చేశాడు. కానీ బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాలి. బాడీ మూవ్ మెంట్ ఫ్రీ అవ్వాల్సి ఉంది. హీరోయిన్ సౌమ్య మీనన్ బాగా చేసింది. చూడ్డానికి యంగ్ రేణు దేశాయ్‌లా ఉంది. హీరోయిన్ తండ్రిగా రావు రమేష్, హీరో తండ్రిగా నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గగన్ విహారీ నెగటివ్ షేడ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. రాంప్రసాద్, సత్యం రాజేష్, అలీ నవ్వులు పూయించారు.
టెక్నీషియన్లుః
దర్శకుడు రామకృష్ణ పరమహంస ఓ రెగ్యూలర్ స్టోరీని తీసుకుని రిస్క్ చేశాడు. కొంత వరకు రెగ్యూలర్ ట్రాక్‌లోకి వెళ్లినా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. చాలా వరకు బోర్ ఫీలింగ్ లేకుండా చూసుకున్నాడు. ఆయన పడ్డ కష్టం సినిమాలో కనిపిస్తుంది. బీఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. జీకే(ఘంటాడి కృష్ణ) మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. పాటలు, బీజీఎం అదిరిపోయింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఓ 20వ నిమిషాల సినిమా లేపేస్తే క్రిస్పిగా బాగుండేది. నిర్మాణ విలువలకు లోటు లేదు. వంక పెట్టాల్సిన పనిలేదు.
ఫైనల్‌గాః ఫర్వాలేదనిపించే రెగ్యూలర్ లవ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా.
రేటింగ్‌ః 2.5
సాంకేతిక బృందం:
సమర్పకుడు: బెక్కం వేణుగోపాల్
బ్యానర్: S.L.S. సినిమాలు
చిత్రం: "లెహరాయి"
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
రచయిత, దర్శకుడు: రామకృష్ణ పరమహంస
సంగీతం: GK (ఘంటాడి కృష్ణ)
D.O.P.: MN బాల్ రెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఉమా మహేష్, పాండు తన్నీరు
ఫైట్ మాస్టర్: శంకర్
కొరియోగ్రాఫర్‌లు: అజయ్ సాయి
రచయిత: పరుచూరి నరేష్.