జమున టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. ఆ తరం హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సావిత్రి తర్వాత ఆమెదే ఎక్కువ రెమ్యూనరేషన్. ఇతర నటుల మాదిరి ఆమె డబ్బులు దుబారా చేయలేదు. దానధర్మాలు చేసినా స్తోమతకు మించిపోలేదు. సినిమా నిర్మాణం వంటి రిస్క్స్ తీసుకోలేదు.