పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి షాకింగ్ కౌంటర్‌.. ఆ రింగ్‌ వెనకాల సీక్రెట్‌ రివీల్‌ చేసిన హాట్‌ బ్యూటీ..

Published : Jul 05, 2022, 05:19 PM ISTUpdated : Jul 05, 2022, 07:36 PM IST

టాలీవుడ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిపై అనేక రూమర్లు ఆ మధ్య వైరల్‌ అయ్యాయి. ఆమె మ్యారేజ్‌ చేసుకోబోతుందని, ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది.

PREV
16
పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి షాకింగ్ కౌంటర్‌.. ఆ రింగ్‌ వెనకాల సీక్రెట్‌ రివీల్‌ చేసిన హాట్‌ బ్యూటీ..

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. `అందాల రాక్షసి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో తన మార్క్ ని చాటుకుంది. అందరికి నోటెడ్‌ అయ్యింది. జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ, మంచి పాత్రలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. లావణ్య చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతుంది. తాజాగా ఆమె ఆమె నటించిన తెలుగు మూవీ `హ్యాపీబర్త్ డే`(Happy Birthday) ఈ నెల 8న విడుదల కాబోతుంది. 

26

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి.. తనపై వచ్చిన లవ్‌, మ్యారేజ్‌(Lavanya Tripathi Wedding Rumours) రూమర్లపై స్పందించింది. దానికి షాకింగ్‌ కౌంటరిచ్చింది లావణ్య. మ్యారేజ్‌ రూమర్స్ తనని ఆశ్చర్యపరిచినట్టు తెలిపింది. ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, సాయంత్రం మ్యారేజ్‌ జరగబోతుందని రూమర్స్ వైరల్‌ అయ్యాయి. వాటిపై ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని తెలిపింది.

36

ఆ వార్తలు ఎలా పుట్టాయో తనకు తెలియదని, కానీ ఈ రూమర్స్ విని నవ్వుకున్నానని, అస్సలు పట్టించుకోలేదని తెలిపింది. తాను జస్ట్‌ లైట్‌ తీసుకున్నట్టు వెల్లడించింది లావణ్య త్రిపాఠి. అయితే ఎంగేజ్ మెంట్‌ కూడా అయ్యిందనేదానిపై చెబుతూ, తన వేలికి ఉన్న రింగ్‌ తానే సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నానని, ఎవరూ కోనివ్వలేదని, తనకెవరూ పెట్టలేదని కౌంటరిచ్చింది. 

46

ఆ సమయంలో తాను సినిమాల పరంగా గ్యాప్‌ రావడం వల్లే మ్యారేజ్‌ చేసుకోబోతుందనే రూమర్స్ క్రియేట్‌ చేశారని, కానీ తాను సినిమాల విషయంలో చాలా సెలక్టీవ్‌గా ఉంటానని తెలిపింది. చేసే పని ఎంజాయ్‌ చేసేలా ఉండాలని, పాత్రతో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసేలా ఉండాలని చూసుకుంటానని, ఎన్ని సినిమాలు చేశాననేది పట్టించుకోనని వెల్లడించింది లావణ్య. 

56

లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరు కలిసి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారని, త్వరలోనే మ్యారేజ్‌ చేసుకోబోతుందని కొన్ని వార్తలు ఆ మధ్య వినిపించాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిపై తాజాగా లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి `మిస్టర్‌` చిత్రంలో నటించారు.

66

అయితే ఈ పదేళ్ల జర్నీలో తానెప్పుడు తనకు సరైన పేరు, గుర్తింపు రాలేదని, నెంబర్‌ గేమ్‌ ని కూడా తాను పట్టించుకోనని తెలిపింది. మిగిలిన హీరోయిన్లతో పోటీ పడాలని తాను ఎప్పుడూ కోరుకోనని వెల్లడించింది. వచ్చిన పాత్రలు,నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తానని, అందుకే విభిన్నమైన సినిమాలు తన జాబితాలో ఉన్నాయని పేర్కొంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories