నరేష్ మాజీ భార్యలు ఎవరు?  ఎందుకు విడిపోయారు? వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటీ?...  షాకింగ్ డిటైల్స్!

Published : Jul 05, 2022, 04:40 PM IST

నటుడు నరేష్ పెళ్లిళ్లు, ప్రేమలు,  సహజీవనాల చుట్టూ పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అరవైయేళ్ల నరేష్ నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. నరేష్ తో కలిసి బ్రతకడానికి నటి పవిత్ర లోకేష్ సిద్ధమయ్యారు. అయితే మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీతో వివాదం రచ్చగా మారింది.   

PREV
18
నరేష్ మాజీ భార్యలు ఎవరు?  ఎందుకు విడిపోయారు? వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటీ?...  షాకింగ్ డిటైల్స్!


 ఈక్రమంలో నరేష్ వివాహం చేసుకున్న భార్యలు ఎవరు? వాళ్లతో ఆయన విడిపోవడానికి కారణాలు ఏమిటనే? విషయాలపై జనాలు ఆసక్తి చూపుతున్నారు. కాగా విజయనిర్మల మొదటి భర్త కుమారుడైన నరేష్ బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1982లో విడుదలైన నాలుగు స్తంభాలాట మూవి తో హీరోగా మారాడు. నరేష్ పుట్టింది, పెరిగింది సినిమా ప్రపంచంలోనే. ఈ క్రమంలో ఆయన ఆలోచనలు, అలవాట్లు కొంచెం మోడ్రన్ గా ఉండేవి. 

28


80లలో ఓ మోస్తరు హీరోగా నరేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యుక్త వయసులోనే నరేష్ వివాహం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన శ్రీను అనే వ్యక్తి కూతురిని నరేష్ వివాహం చేసుకున్నారు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ కొడుకు. నవీన్ ఒకటి రెండు చిత్రాలలో హీరోగా నటించారు. నవీన్ పుట్టాక నరేష్ భార్య అనారోగ్యం బారినపడ్డారు. ఈ కారణంగా నరేష్ నవీన్ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది. 

38

అనంతరం ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలైన రేఖా సుప్రియను వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఒక కొడుకు పుట్టాడు.  కొన్నేళ్ల కాపురం తర్వాత రేఖా సుప్రియతో కూడా నరేష్ విడిపోయారు. కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న నరేష్ మూడో వివాహం రమ్య రఘుపతితో  జరిగింది.

48


2010లో నరేష్-రమ్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానమని సమాచారం. మూడో భార్యతో నరేష్ విడిపోయిన విషయం చాలా కాలం బయటికి రాలేదు. ఇటీవల రమ్య ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె కొందరు వ్యక్తుల నుండి నరేష్, కృష్ణ కుటుంబం పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని కేసు నమోదు కావడం జరిగింది. 
 

58


ఆ సమయంలో నరేష్ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. రమ్య రఘుపతి నేను విడిపోయి చాలా కాలం అవుతుంది. ఆమె ఇప్పుడు నా భార్య కాదు. రమ్య నేరాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ  ఇచ్చారు. అప్పుడు నరేష్ మూడో భార్యతో కూడా విడిపోయారన్న విషయం బయటికి వచ్చింది. 

68

ఇక నరేష్ రమ్యపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, డబ్బుల కోసం వేధించారని, బ్లాక్ మెయిల్ చేశారని పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ కారణంగానే రమ్యతో విడిపోయినట్లు నరేష్ వెల్లడించారు. ఇక రమ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు.

78
Actor Naresh and Pavithra Lokesh to tie the knot


ఇక లేటెస్ట్ ఎంట్రీ పవిత్ర లోకేష్. ఆమెతో నరేష్ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు  ఉంటున్నట్లు సమాచారం.  తమ మధ్య గొడవలకు పవిత్రనే కారణమంటూ రమ్య ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్, పవిత్రలు చట్టబద్దంగా పెళ్లి చేసుకొనే ఆలోచనలో లేరు. వారి లేటెస్ట్ కామెంట్స్ ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. 

88
Naresh- Pavitra Lokesh

నరేష్ ఏకంగా వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేదంటున్నారు. ఇక మేము సహజీవనం చేస్తున్నాం, పెళ్లి చేసుకోలేదని పవిత్ర ఓపెన్ గా చెబుతున్నారు. సో ఇవన్నీ గమనిస్తుంటే మనస్పర్థలు రానంత వరకు కలిసి బ్రతకాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ చట్టపరంగా  వీలు కాదు. రమ్యకు విడాకులు ఇవ్వకుండా నాలుగో వివాహం చేసుకోవడం కుదరదు.

click me!

Recommended Stories