పెళ్లయ్యాక అలాంటి పాత్రల్లో, నాకేం భయం లేదు.. కానీ, ఫ్యామిలీ నిబంధనలపై మరోసారి లావణ్య కామెంట్స్

Published : Jan 28, 2024, 05:31 PM IST

పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య త్రిపాఠి మీడియా ముందుకు రావడంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మెగా కోడలిగా మారింది కాబట్టి అటెన్షన్ పెరిగింది. మీడియా ప్రతినిధులు ఫ్యామిలీ విషయాల గురించి లావణ్యని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. 

PREV
16
పెళ్లయ్యాక అలాంటి పాత్రల్లో, నాకేం భయం లేదు.. కానీ, ఫ్యామిలీ నిబంధనలపై మరోసారి లావణ్య కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులయ్యారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన చిత్రాలతో బిజీగా ఉంది. 

 

26
Varun Tej

మరోవైపు వరుణ్ తేజ్ నుంచి కూడా ఈ ఏడాది ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. ఇక పెళ్ళైన తర్వాత లావణ్య నుంచి వస్తున్న తొలి ప్రాజెక్టు మిస్ పర్ఫెక్ట్. ఓటిటి వేదికగా ఫిబ్రవరి 2న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. 

 

36

పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య త్రిపాఠి మీడియా ముందుకు రావడంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మెగా కోడలిగా మారింది కాబట్టి అటెన్షన్ పెరిగింది. మీడియా ప్రతినిధులు ఫ్యామిలీ విషయాల గురించి లావణ్యని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా పెళ్లి తర్వాత ఆమె నటించడం గురించి ఎక్కువగా చర్చకు వస్తోంది. 

 

46

పెళ్లి తర్వాత బాధ్యతలు, కండిషన్లు ఉంటాయి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని అడగగా లావణ్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు ఎలాంటి కండిషన్స్ పెడతారు ? అసలు ఎందుకు పెడతారు ? నేను పెళ్ళికి ముందు కూడా నటించాను. ఎప్పుడూ శృతి మించే విధంగా బోల్డ్ పాత్రలు చేయలేదు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు చేయను. 

 

56

పెళ్లయింది కాబట్టి బయపడి చేయకపోవడం కాదు.. నాకు అలాంటి పాత్రలు కంఫర్టబుల్ గా అనిపించవు. నేను ఇప్పుడు చేస్తున్న తరహా పాత్రలో కంటిన్యూ చేస్తా. అలాంటప్పుడు నాకు ఎవరైనా ఎందుకు కండిషన్స్ పెడతారు అని లావణ్య పేర్కొంది. 

 

66

నాకు పెళ్లయింది.. నా భర్త తన వృత్తిలో నటనలో ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నేను ఏమీ మాట్లాడను. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మేమిద్దరం చర్చించుకుంటాం. నా విషయంలో కూడా వరుణ్ అంతే అని లావణ్య సమాధానం ఇచ్చింది. 

 

click me!

Recommended Stories