Sai Pallavi : 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలనుకున్న సాయిపల్లవి.. ఇప్పటికీ వాయిదా వేయడానికి కారణమేంటీ?

Published : Jan 28, 2024, 04:25 PM ISTUpdated : Jan 28, 2024, 04:26 PM IST

తను పెళ్లి చేసుకోకుండా చెల్లెలు పెళ్లికి సాయిల్లవి Sai Pallavi గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు ఆమె పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం ఏంటీ? గతంలో తన మ్యారేజ్ పై ఏం చెప్పారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. 

PREV
16
Sai Pallavi : 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలనుకున్న సాయిపల్లవి.. ఇప్పటికీ వాయిదా వేయడానికి కారణమేంటీ?

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి  Sai Pallavi గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళం, మలయాళం చిత్రాలతో దుమ్మురేపిన నేచురల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా వాళ్ల ఇంట్లో తన చెల్లి పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే.

26

అయితే, సాయిపల్లవితన పెళ్లిని వాయిదా వేసుకొని చెల్లి పూజా కన్నన్ (Pooja Kannan) పెళ్లి కోసం సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా ఎంగేమ్ మెంట్ తనే దగ్గరుండి జరిపింది కూడానూ. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

36

అసలు సాయిపల్లవి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు కనాలని కూడా భావించింది.... ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు తన పెళ్లిని వాయిదా వేసి చెల్లికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఓ రీజన్ కూడా చెప్పుకొచ్చింది. 

46

తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొత్తలో సాయిపల్లవి పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయా షోలకు హాజరయ్యారు. ఆ సమయంలో తన పెళ్లిపై వచ్చిన ప్రస్తావనకు నిర్భయంగా బదులిచ్చింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

56

గతంలో తను మాట్లాడుతూ.. ‘నేను 18 ఏళ్లు ఉన్నప్పుడు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని భావించాను. 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలని ఊహించుకున్నాను. ఎంబీబీఎస్ చేసే ప్రారంభంలో అలా అనుకున్నాను. కానీ తర్వాత ఆ నిర్ణయాలను మార్చుకున్నాను. 

66

మా ఇంట్లోని కొన్ని కీలకమైన బాధ్యతలను తీసుకోవాల్సి రావడంతో పెళ్లిని వాయిదా వేశాను. కానీ నటిగా మంచి గుర్తింపు దక్కడంతో పెళ్లికి ఇంకాస్తా సమయం పొడిగించానంది’... మరోవైపు తను చేసుకోబోయే వాడు ‘ఇన్నోసెంట్ గా ఉండాలని, మహిళలకు రెస్పెక్ట్ చేయాలని.. కొంచెం చిన్నపిల్లల మనస్థత్వం కలిగి ఉండాలని’ క్వాలిటీస్ కూడా చెప్పేసింది. ప్రస్తుతం చైతూ సరసన ‘తండేల్’లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories