సుధీర్‌, రష్మిల మ్యారేజ్‌ తర్వాతే నాది.. పెళ్లిపై ఓపెనైన హైపర్‌ ఆది.. `లవ్వా? అరెంజా?` ఏ పెళ్లి చేసుకుంటాడంటే

Published : Dec 02, 2023, 08:45 PM ISTUpdated : Dec 02, 2023, 08:47 PM IST

తనదైన కామెడీ పంచ్‌లతో అలరించే హైపర్‌ ఆది.. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆయన పెళ్లి గురించి చెబుతూ సుడిగాలి సుధీర్‌, రష్మిల మ్యారేజ్‌ తర్వాతనే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. 

PREV
16
సుధీర్‌, రష్మిల మ్యారేజ్‌ తర్వాతే నాది.. పెళ్లిపై ఓపెనైన హైపర్‌ ఆది.. `లవ్వా? అరెంజా?` ఏ పెళ్లి చేసుకుంటాడంటే

సినిమాల్లో ప్రభాస్‌ ఎలానో బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, యాంకర్ ప్రదీప్‌, రష్మి, శ్రీముఖి అలా. వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు. వాళ్లు చెప్పరు. గత కొన్ని ఏళ్లుగా ఇదే చర్చ జరుగుతుంటుంది. సైలెంట్‌ అవుతుంది. ఏదో సందర్భంలో వీరి పెళ్లికి సంబంధించిన చర్చ వస్తూనేఉంటుంది. వాళ్లు ఇదిగో అదిగో అంటూ దాట వేస్తూనే ఉంటారు. 
 

26

ఇటీవల ఏకంగా సుడిగాలి సుధీర్‌ మాత్రం తాను పెళ్లి ఇప్పట్లో చేసుకోనని తెగేసి చెప్పాడు. తనకు ఇప్పుడు పెళ్లి ఆలోచనే లేదన్నారు. చేసుకోవద్దని అనుకుంటున్నట్టు చెప్పారు. దేవుడు ఆ వైపు దృష్టి మరిల్చితే చెప్పలేను, అప్పటి వరకు పెళ్లి మాట ఎత్తబోనని చెప్పారు. అప్పటి వరకు తాను సినిమాలపైనే ఫోకస్‌ పెడుతున్నట్టు తెలిపారు. ఇక్కడ హీరోగా నిలబడాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అయితే రష్మి, సుధీర్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే రూమర్లు ఇంకా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. మరి సుధీర్‌ పెళ్లిచేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటాడనేది పెద్ద ప్రశ్న. 
 

36

తాజాగా వీరి రిలేషన్‌పై హైపర్‌ ఆది స్పందించారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యలో ఆయన మాట్లాడుతూ, సుధీర్‌, రష్మితో లవ్‌ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుందని అడగ్గా, అది టీవీ కోసం చేసిందన్నారు. అంటే ఇద్దరి మధ్య ఏం లేదా అంటే మళ్లీ.. ఉంటుందని సమాధానం ఇవ్వడం విశేషం. తొమ్మిదేళ్లు కలిసి పనిచేశారు. కలిసి ఓకే షో చేశారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. అలాంటప్పుడు ఏదో ఉంటుందన్నారు. అయితే అది వారి వ్యక్తగతమైన విషయమని దాట వేశాడు ఆది. తేల్చుకోవాల్సింది వాళ్లిదన్నారు. 
 

46

ఇక తన పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. తనకంటే పెద్ద వాళ్లైన సుధీర్‌, ప్రదీప్‌ ఉన్నారు అని, వాళ్లు చేసుకున్నాక చేసుకుంటానని చెప్పాడు ఆది. తనని ఇంట్లో ఫోర్స్ చేయడం లేదని, తను ఓ దారిలో వెళ్తున్న, ఆ విషయాన్ని ఇంట్లో అర్థం చేసుకుంటారని, అందుకే తనపై ఒత్తిడి తేవడం లేదన్నారు. మరి ప్రేమ పెళ్లినా, పెద్దలు కుదిర్చిన పెళ్లినా అని యాంకర్‌ ప్రశ్నించగా..
 

56
photo credit-dhee promo

తాను పెద్దలు కుదిర్చిన పెళ్లికే ప్రయారిటీ ఇస్తానని, అలానే పెళ్లిచేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు హైపర్‌ ఆది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అనేది పేరెంట్స్ కి బాగా నచ్చిన అంశం. మా అబ్బాయికి ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని వాళ్లు కోరుకుంటారు. ఆ ప్రక్రియని వాళ్లు ఎంజాయ్‌ చేస్తారు. దాన్ని వాళ్లకే వదిలేస్తే బెటర్ అని తన ఫీలింగ్‌ అని అన్నారు ఆది. అయితే అది పక్కన పెడితే గ్లామర్‌ ఇండస్ట్రీలో చాలా టెంప్టేషన్స్ ఉంటాయని, అవి కామనే అని తెలిపారు ఆది. ఒక్కో సమయంలో ఒక్కొక్కరిపై ఇష్టం కలుగుతుందని, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివన్నారు. 

66

హైపర్ ఆది ప్రస్తుతం టీవీ షోస్‌లో `శ్రీ దేవీ డ్రామా కంపెనీ`, `ఢీ` షోస్ చేస్తున్నారు. తనదైన నవ్వులతో మెప్పిస్తున్నారు. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఆయన కమెడియన్‌గా చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ `జనసేన`కి మద్దతుగా ఆయా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories