‘సలార్’ రెండు పార్టులుగా విడుదల కాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. నెక్ట్స్ ‘కల్కి 2898 ఏడీ’, ‘స్పిరిట్’, ‘రాజా డిలక్స్’ వంటి సినిమాలు రానున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో డార్లింగ్ ‘సలార్’ ప్రమోషన్స్ లో జాయిన్ కానున్నారు.