నాగచైతన్యకి మదర్‌గా చేయాలన్నారు.. నాగార్జునకి నో చెప్పా.. అసలు విషయం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి

Published : Jul 05, 2022, 10:49 PM IST

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తాజాగా షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. `బంగార్రాజు` సినిమా విషయంలో జరిగిన చర్చలను బయటపెట్టింది. నాగార్జున ఫోన్‌ చేసిన విషయం వెల్లడించింది. 

PREV
18
నాగచైతన్యకి మదర్‌గా చేయాలన్నారు.. నాగార్జునకి నో చెప్పా.. అసలు విషయం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఒక్కో అవకాశాన్ని ఒడిసి పట్టుకుని హీరోయిన్‌గా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా చివరగా `చావు కబురు చల్లగా` చిత్రంతో మెరిసింది. ఇప్పుడు `హ్యాపీబర్త్ డే` (Happy Birthday) చిత్రంతో రాబోతుంది. జులై 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది లావణ్య త్రిపాఠి. 

28

నాగార్జున(Nagarjuna)తో `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రంలో లావణ్య నటించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన `బంగార్రాజు` (Bangarraju) చిత్రంలో మాత్రం కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకున్నారు. మరి సీక్వెల్‌కి మిమ్మల్ని అప్రోచ్‌ అయ్యారా? అనే ప్రశ్నకి లావణ్య స్పందిస్తూ, తనని నాగార్జున అప్రోచ్‌ అయినట్టు తెలిపింది. నాగచైతన్య(Naga Chaitanya) లీడ్‌గా చేస్తున్నాడని, ఆయనకు మదర్‌ పాత్రని పోషించాల్సి ఉందని చెప్పారు. `సోగ్గాడే చిన్ని నాయన`లో నాగార్జునకి జోడీగా లావణ్య నటించిన నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్‌లో చైతూకి మదర్‌గా చేయాల్సి ఉంటుందన్నారట. 
 

38

నాగార్జున ఈ విషయం చెప్పగానే లావణ్య షాక్‌ అయ్యిందట. నాగచైతన్య సరసన నటించాల్సిన నేను, ఆయనకు తల్లిగా నటించడమేంటని, తాను చేయనని, నాగ్‌కి నో చెప్పేసిందట లావణ్య త్రిపాఠి. అయితే `బంగార్రాజు`లో తాత నాగార్జున పాత్రని ఉంచి, తండ్రి నాగార్జున పాత్రని తీసేసిన విషయం తెలిసిందే. అలా లావణ్య పాత్రని కూడా లేపిసి మ్యానేజ్‌ చేశారు. 
 

48

ప్రస్తుతం తాను నటిస్తున్న `హ్యాపీబర్త్ డే` చిత్రం గురించి లావణ్య త్రిపాఠి చెబుతూ, ఇందులో తాను హ్యపీ అనే పాత్రని పోషిస్తున్నట్టు తెలిపింది. సర్రియల్ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిదని, కథ, కథనం, జోనర్‌ కూడా కొత్తగా ఉంటాయని చెప్పింది. ఇందులో తాను మొదటి సారి యాక్షన్‌ చేసినట్టు తెలిపింది. ఫస్ట్ టైమ్‌ గన్ పట్టుకున్నానని, అది చాలా బరువుగా ఉందని తెలిపింది. అప్పుడర్థమైంది, హీరోలకు ఎందుకు అంతగా పే చేస్తారో అని చెప్పింది లావణ్య. 

58

రియల్‌ లైఫ్‌లో తాను సీరియస్‌ పర్సన్‌ కాదని, తాను అలాంటి సినిమాలు చేయడం వల్ల అలా అనుకుంటారని, కానీ తాను కామెడీ చేస్తానని, ఈసినిమాలో ఈజీగానే కామెడీ చేశానని, పాత్రని బాగా ఎంజాయ్‌ చేసినట్టు తెలిపింది. సినిమాలో కామెడీ కూడా ఫోర్స్ గా ఉండదని, సహజంగానే వస్తుందని, పాత్రల చేష్టల వల్ల కామెడీ జనరేట్‌ అవుతుందని చెప్పింది లావణ్య. 

68

`నా తొలి చిత్రానికి రాజమౌళి ప్రజెంట్‌ చేశారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం కోసం బ్లెస్‌ చేయడానికి రావడం ఆనందంగా ఉంది. పాజిటివ్‌ సైన్‌గా భావిస్తున్. ఫీమేల్ ఓరియెంటెడ్ అనగానే చాలా సీరియస్ గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి ఎంటర్ టైనర్ లో లీడ్ రోల్ రావడం ఆనందం. రితేష్ రానా నన్ను ఒక ఇంటర్వ్యూ లో చూసి హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలవుతున్నా`ని తెలిపింది లావణ్య. 

78

`పదేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. అదే గొప్ప ఆనందం. అందరు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కావాలంటే కుదరదు. అందుకే నా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. సక్సెస్‌,ఫెయిల్యూర్‌ విసయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకొను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నాజర్నీ విషయంలో చాలా సంతృప్తికరంగానే ఉన్నాను. చేసే సినిమాలు తక్కువగా ఉన్నా, ప్రతి రోజూ నేను కథలు వింటూనే ఉంటాను. ఎంపికలో మాత్రం పర్టిక్యులర్ గా ఉంటాను. ఒక నటిగా బలమైన పాత్రలు చేయాలనీ అనుకుంటాను. చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. బహుశా దీని వలన సినిమాలు తగ్గించినట్లు అనిపించవచ్చు` అని పేర్కొంది. ప్రస్తుతం తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపింది. యాక్షన్‌ సినిమాలు చేయడం ఇష్టమని తెలిపింది.

88

ఇక లావణ్యత్రిపాఠి మెయిన్‌ లీడ్‌గా, రితేష్‌ రానా దర్శకత్వంలో రూపొందిన `హ్యాపీబర్త్ డే` చిత్రానికి క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ సమర్పణలో చిరంజీవి(చెర్రి), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories