కత్తిలాంటి పోజులతో చిత్తు చేస్తున్న లావణ్య త్రిపాఠి.. స్టయిలీష్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ..

Published : Oct 23, 2022, 02:40 PM IST

లావణ్య త్రిపాఠి అడపాదడపా సోషల్‌ మీడియాలో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ ఎప్పుడొచ్చినా దుమారం రేపుతుంది. తన పిచ్చెక్కించే అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
17
కత్తిలాంటి పోజులతో చిత్తు చేస్తున్న లావణ్య త్రిపాఠి.. స్టయిలీష్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ..

వరుణ్‌ తేజ్‌ లవర్‌గా వార్తల్లో నిలుస్తున్న లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె స్టయిలీష్‌ పోజులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. స్టయిలీష్‌ కూలింగ్‌ గ్లాసెస్‌తో హోయలు పోయింది. ఇందులో ఆమె కత్తిలాంటి పోజులతో చిత్తు చేస్తుంది. హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. 

27

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. లావణ్య త్రిపాటి ఒకప్పుడు చాలా పొదుపుగానే గ్లామర్‌ షో చేసేది. కానీ ఇప్పుడు రెచ్చిపోతుంది. హద్దులు చెరిపేస్తూ అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తుంది. అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 

37

అయితే అవకాశాలనేవి ఏవైనా చేయిస్తాయనడానికి ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆఫర్లు లేక ఖాళీగానే ఉంది లావణ్య. చివరగా ఆమె `హ్యాపీబర్త్ డే` చిత్రంతో మెరిసింది. సెటైరికల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ఆదరణ నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమెకి అవకాశాలు రావడం లేదు. ఛాన్స్ ల కోసం హాట్‌ షోకి తెరలేపుతుందీ అందాల భామ. స్కిన్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. 

47

లావణ్య త్రిపాఠి డేటింగ్‌ రూమర్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి `మిస్టర్‌` చిత్రంలో నటించారు. ఆ టైమ్‌ నుంచి ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే రూమర్స్ ఊపందుకున్నాయి. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

57

`అందాల రాక్షసి` చిత్రంతో తెలుగులోకి దూసుకొచ్చిన ఈ అందాల రాక్షసి తెలుగులోనే ఎక్కువగా రాణించింది. `దూసుకెళ్తా`, `మనం`, `భలే భలే మగాడివోయ్‌` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. నానితో చేసిన `భలే భలే మగాడివోయ్‌`, నాగార్జునతో చేసిన `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రాలు పెద్ద హిట్‌ అవ్వడంతో ఇక లావణ్య కెరీర్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని భావించారు. 
 

67

కానీ ఆమెకి అవకాశాలు పెరిగాయి, కానీ హీరోయిన్‌గా స్టార్‌ హోదాకి రీచ్‌ కాలేకపోయింది. ఆ తర్వాత ఆమె వరుసగా `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `శ్రీరస్తు శుభమస్తు`, `మిస్టర్‌`, `రాధ`, `యుద్ధశరణం`, `ఉన్నది ఒక్కటే జిందగి`, `ఇంటలిజెంట్‌`, `అంతరిక్షం`, `అర్జున్‌ సురవరం`, `ఏ1 ఎక్స్ ప్రెస్‌`, `చావు కబురు చల్లగా`, `హ్యాపీ బర్త్ డే` చిత్రాలతో మెరిసింది. అన్ని మిడిల్‌, చిన్నబడ్జెట్‌ చిత్రాలే కావడం గమనార్హం. 

77

పైగా లావణ్యకి ఆ తర్వాత సరైన హిట్‌ దక్కలేదు. అప్పట్లో గ్లామర్‌కి కాస్త లిమిటేషన్స్ పెట్టుకోవడంతో కమర్షియల్‌ సినిమా అవకాశాలు రాలేదు. లేదంటే ఈ బ్యూటీనే నో చెప్పిందని చెప్పొచ్చు. తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలకే ఓకే చెప్పడంతో, సినిమాలు తగ్గాయి, పైగా అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నెమ్మదిగా ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదని టాక్‌. ఓ తమిళ సినిమా చేస్తుందని తెలుస్తుంది. `పులిమేక` అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది లావణ్య. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories