కొత్తజంట వరుణ్‌లవ్‌ స్పెషల్‌ ఫోటో షూట్‌.. లెహంగా చోళీలో లావణ్య, కుర్తాలో వరుణ్‌తేజ్‌.. దిష్టి తీయాల్సిందే

Published : Nov 14, 2023, 06:29 AM ISTUpdated : Nov 14, 2023, 11:19 AM IST

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి సినిమా ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి లైఫ్‌ లో సక్సెస్‌ అయ్యారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచారు. అయితే ఈ దీపావళిని మరింత స్పెషల్‌ గా మార్చారు. 

PREV
19
కొత్తజంట వరుణ్‌లవ్‌ స్పెషల్‌ ఫోటో షూట్‌.. లెహంగా చోళీలో లావణ్య, కుర్తాలో వరుణ్‌తేజ్‌.. దిష్టి తీయాల్సిందే

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్‌ గా జరిగింది. డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకుని ఈ జంట చాలా హ్యాపీగా ఉంది. ఒక పెళైన కొత్తలోని అనుభూతులను ఎంజాయ్‌ చేస్తున్నారు. తరచూ బయట సందడి చేస్తున్నారు.
 

29

తాజాగా ఈ మెగా కొత్త జంట దీపావళి పండగ వేళ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచారు. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఈ దివాళి సందడంతా వీరిదే అనేట్టుగా చేశారు. మొన్న నిహారిక సినిమా ఓపెనింగ్‌లో సందడి చేశారు.ఆ తర్వాత దీపావళిని ఇంట్లో మెగా ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీవాళి పార్టీలోనూ పాల్గొన్నారు. 
 

39

ఇప్పుడు ఈ దీపావళి పండుగ సందర్భంగా స్పెషల్‌ ఫోటో షూట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఈ కొత్త జంట ఎంతో ముచ్చటగా ఉండటం విశేషం. 
 

49

ఇక ఈ ఫోటో షూట్‌లో రెడ్‌ లెహంగా చోళీలో లావణ్య త్రిపాఠి మెరిసిపోతుంది. మరోవైపు వరుణ్‌ తేజ్‌ బ్లాక్‌ కుర్తాలో మెరిశారు. పర్‌ఫెక్ట్ జోడీ అని చాటి చెబుతున్నారు. అంతేకాదు, కాస్త రొమాంటిక్‌గా ఫోటోలకు పోజులిస్తూ ఇంటర్నెట్‌ ఫోకస్‌ అంతా తమవైపు తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

59

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొత్తజంట అదిరిపోయిందని, ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు. దీపావళి విషెస్‌ చెబుతూ దిష్టి తీసుకోమని కామెంట్లు పెడుతుండటం విశేషం. 
 

69

ఇక విభిన్నమైన సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు వరుణ్‌ తేజ్‌. `ఫిదా`, `తొలిప్రేమ, `గద్దల కొండ గణేష్‌`, `ఎఫ్‌2`,ఎఫ్‌3` సినిమాలతో ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల సోలోగా హిట్‌ పడటం లేదు. త్వరలో ఆయన `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంతో రాబోతున్నారు. పెళ్లి తర్వాత ఆయన్నుంచి వస్తోన్న సినిమా ఇది. మరి హిట్‌ పడుతుందా అనేది చూడాలి. 
 

79

ఇక `అందాల రాక్షసి` సినిమాతో పాపులర్‌ అయ్యింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమె `భలే భలే మగాడివోయ్‌` వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. కానీ ఈ మధ్య కాలంలో సక్సెస్‌ లేదు. దీంతో లైఫ్‌ లో సెటిల్‌ అవ్వాలనుకుంది. ప్రేమించిన వాడిని తన వశం చేసుకుంది. 
 

89

`మిస్టర్‌` సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, మనసులు కలిశాయి. దాన్ని నెక్ట్స్ లెవల్‌ కి తీసుకెళ్లాలనుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. ఎట్టకేలకు నవంబర్‌ 1న ఇటలీలో గ్రాండ్‌ పెళ్లి చేసుకున్నారు. 
 

99

మరి పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇప్పటికే రెండు మూడు చిత్రాలకు కమిట్‌ అయ్యిందని అన్నారు. ఆ మధ్య ప్రకటించారు కూడా. మరి దాన్ని కంటిన్యూ చేస్తుందా? మెగా ఫ్యామిలీ నిబంధనలు పెడుతుందా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories