కమల్‌ హాసన్‌ నోరు జారిన మాటే నిజమైంది.. `భారతీయుడు 2`లో శంకర్‌ చేసిన మిస్టేక్‌ ఏంటంటే?

Published : Jul 13, 2024, 11:19 AM IST

కమల్‌ హాసన్‌ నటించిన `భారతీయుడు 2` శుక్రవారం విడుదలైంది. సినిమా ఫలితం విషయంలో కమల్‌ నోరు జారిన మాటే నిజమనే ఫీలింగ్‌ కలుగుతుంది.   

PREV
17
కమల్‌ హాసన్‌ నోరు జారిన మాటే నిజమైంది.. `భారతీయుడు 2`లో శంకర్‌ చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Yaskin Kalki 2898 AD

కమల్‌ హాసన్‌.. `కల్కి 2898 ఏడీ`లో కేవలం ఐదు నిమిషాలే కనిపించి సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. గూస్‌బంమ్స్ తెప్పించారు. దీంతో కమల్‌ కి క్రేజ్‌ ఏర్పడింది. ఆ క్రేజ్‌ ఆయన హీరోగా నటించిన `భారతీయుడు 2`కి హెల్ప్ అవుతుందని అంతా భావించారు. ఓపెనింగ్‌ విషయంలో అది కలిసి వచ్చింది. 

27

ఇదిలా ఉంటే రిలీజ్‌కి ముందు ఆ మధ్య కమల్‌ హాసన్‌ `భారతీయుడు 2`పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను `భారతీయుడు 3` పార్ట్ కోసం ఎదురుచూస్తున్నానని, దానికి నేను అభిమానిని అని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అంటే `భారతీయుడు 2`లో మ్యాటర్‌ లేదా? ఆకట్టుకునేలా ఉండదా? అనే వాదనలు ప్రారంభమయ్యాయి. అది సినిమాకి చాలా నష్టం తెచ్చింది. దీంతో తేరుకున్న కమల్‌ నష్టనివారణ చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 
 

37

ఇక ఇప్పుడు సినిమా చూశాక కమల్‌ హాసన్‌ నోరు జారిన మాట వాస్తవమే అని, ఆయన లీక్‌ చేసిన విషయమే ఇప్పుడు నిజమైందని అంటున్నారు ఆడియెన్స్‌. కమల్‌ లీక్‌ చేసిన మ్యాటర్‌ నిజమే అని, `భారతీయుడు 2`లో ఏం లేదంటున్నారు. కమల్‌ తప్పు చెప్పడని కామెంట్‌ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన `భారతీయుడు 2` చిత్రానికి చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వస్తుంది. బిలో యావరేజ్‌ అనే టాక్‌ ఎక్కువగా వినిపిస్తుంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. రొటీన్‌ మూవీగా నిలిచింది. `భారతీయుడు` కంటే గొప్పగా లేదని, మళ్లీ అవే చూపించారని అంటున్నారు. సోషల్‌ మీడియాని హైలైట్‌ చేశారుగానీ, అంతకు మించి సినిమాలో ఏం లేదంటున్నారు. 
 

47

దర్శకుడు శంకర్‌..`భారతీయుడు 2` విషయంలో చేసిన మిస్టేక్‌ ఏంటంటే.. కాంటెంపరరీ ఇష్యూస్‌తో అధికారులు లంచాలను టార్గెట్ చేస్తూ సినిమాని తెరకెక్కించారు. కానీ దీని వెనకాల ప్రభుత్వాల వైఫల్యాలను, రాజకీయ లాంచాలను, కుంభకోణాలను ఆయన చూపించలేకపోయాడు. పైగా సినిమాలో పేదలు పడే బాధలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయాడు. సినిమాలో ప్రారంభం నుంచి ఎమోషన్స్ క్యారీ కాలేదు. సీన్‌ బై సీన్లు వస్తున్నాయి తప్పితే, ఆ గాఢత మిస్‌ అయ్యింది. దీంతో సీన్లు తేలిపోయాయి. భారతీయుడు కమ్‌ బ్యాక్‌ అనే నినాదం కూడా పండలేదు. సింపుల్‌గానే అనిపిస్తుంది. ఆయన రావడానికి బలమైన రీజన్‌ చెప్పలేకపోయారు. ఇండియన్‌ కమ్‌ బ్యాక్‌ అనే నినాదంలో బలం లేదు. దీంతో అది కిక్‌ ఇవ్వలేదు. 

57

మరోవైపు స్కామ్‌లు చేసిన వారిని, కార్పొరేట్లని భారతీయుడు చంపేసే సీన్లలో ఆయన క్లాస్‌ పీకడమే ఎక్కువగా ఉంది. అది కూడా అర్థం కానీ రీతిలో ఉంది. బాగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఆ సీన్లు బోర్‌ తెప్పిస్తాయి. మరోవైపు క్లైమాక్‌కి ముందు వరకు సిద్ధార్థ్‌నే హీరోలాగా చూపించారు. కమల్‌ మధ్య మధ్యలో మెరుపుతీగలాగ వచ్చిపోతున్నాడు తప్పితే, ఆయన ఫుల్‌ లెన్త్ లేదు. అది కూడా అభిమానులను నిరాశ పరిచింది. కమల్‌ సినిమా అన్నప్పుడు ఆయన్నే చూడాలనుకుంటారు ఫ్యాన్స్. ఆ కొరత ఏర్పడింది.
 

67

సినిమా మొత్తానికి క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. మిగిలినదంతా సాగదీత వ్యవహారమే. క్లైమాక్స్ లో కమల్‌ రచ్చ చేశాడు. పరుగులు పెట్టించారు. కానీ ఆయా సీన్లు కూడా బాగా సాగదీశారు. ఇక కమల్‌ గెటప్స్ కూడా కుదరలేదు. రకరకాల గెటప్‌ల్లో చూపించారు. కానీ ఏ గెటప్‌లోనూ కమల్‌ హాసన్‌ కనిపించలేదు. ఇంకెవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా మైనస్‌. సేనాపతి అంటే ఒక బ్రాండ్‌ గెటప్‌ ఉంది. ఇందులో దాన్నే మిస్‌ చేశారు. అయితే సన్నివేశాల డిమాండ్‌ కోసం డిఫరెంట్‌ గెటప్స్ లో చూపించినా అవి ఆడియెన్స్ ని మెప్పించేలా లేవు. దీంతో `భారతీయుడు 2`లో సేనాపతిని మిస్సింగ్‌ అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో శంకర్‌ బిగ్‌ మిస్టేక్‌ చేశారు. దాని ఫలితం సినిమా ఫ్లాప్‌ దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. 
 

77

అయితే కమల్‌ చెప్పినట్టుగానే `భారతీయుడు 3`లో అసలు మ్యాటర్‌ ఉండబోతుంది. ప్రీక్వెల్‌గా దీన్ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. సేనాపతి గతంలో ఏం చేసేవాడు, ఆయన ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడాడు? ఆయన చేసిన యుద్దాలేంటి? ఇవన్నీ పీరియాడికల్‌గా చూపించబోతున్నట్టుగా గ్లింప్స్ వదిలింది టీమ్‌. దీంతో `భారతీయుడు 3` మాత్రం క్యూరియాసిటీని పెంచుతుంది. మరి ఇదైనా ఆకట్టుకుంటుందా? డిజప్పాయింట్‌ చేస్తుందా అనేది చూడాలి. వచ్చే ఏడాది ప్రారంభంలో `భారతీయుడు 3`ని విడుదల చేయబోతున్నట్టు `ఇండియన్‌ 2` ఎండింగ్‌లో ప్రకటించారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories