ఏ.ఆర్.రెహమాన్ 30 ఏళ్ళకు పైగా తన సంగీతంతో అభిమానులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో పాటలకు సంగీతం అందించారు. దేశవ్యాప్తంగా ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.