ఇవ్వాళ మహేశ్ బాబు - నమత్ర పెళ్లి రోజు.. రేర్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. నమ్రతకు కాస్ట్లీ గిఫ్ట్?

First Published | Feb 10, 2023, 11:21 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో రేర్ అండ్ రొమాంటిక్ పిక్స్ ను పంచుకున్నారు. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)లకు ఈరోజు ప్రత్యేకమైన రోజు.  ఈ స్టార్ కపుల్ వివాహా బంధంలోకి అడుగుపెట్టి నేటితో 18 ఏండ్లు పూర్తైంది. ఈ సందర్భంగా అభిమానులు వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

ప్రస్తుతం మహేశ్ బాబు - నమ్రతా వేకేషన్ లో ఉన్నారు. తమ మ్యారేజ్ డే సందర్భంగా రొమాంటిక్ ప్లేస్ స్పెయిన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈరోజు పెళ్లిరోజు కావడంతో ఉదయమే ఒకరికొకరు క్యూట్ గా విషెస్ తెలుపుతున్నారు. జంటగా వారి 18 ఏండ్ల ప్రయాణం సంతోషంగా ఉందని వ్యక్తపరిచారు.


నమ్రతా పోస్ట్ చేస్తూ.. ‘18 ఏండ్ల కింద మేము తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాన్ని పురస్కరించుకుంటూ మహేశ్ బాబుకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొంది.  ఇక మహేశ్ బాబు.. ‘మేము... 18 సంవత్సరాలు కొంచెం క్రేజీగా, చాలా ప్రేమగా గడిపాం. ఈప్రయాణం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి. వార్షికోత్సవ శుభాకాంక్షలు నమత్రా శిరోద్కర్ ఘట్టమనేని’ అంటూ విషెస్ తెలిపారు. 
 

మ్యారేజ్ డే సందర్భంగా మహేశ్ బాబు నమ్రతకు ఓ కాస్ట్లీ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఇక వివాహా వార్షికోత్సవాన్ని విదేశంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో రేర్ అండ్ రొమాంటిక్ పిక్స్ ను కూడా పంచుకున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నమ్రతా పంచుకున్న ఫొటోలో.. మహేశ్ బాబుపై నమ్రతా ముద్దుల వర్షం కురిపిస్తూ తన ప్రేమను చూపించే ఫొటోలను పంచుకుంది. ఈరొమాంటిక్ పిక్ తో వీరిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో అర్థం అవుతోంది. ఇక మహేశ్ బాబు.. నమత్రాతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను పంచుకున్నారు. మందహాసంతో ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

‘వంశీ’ చిత్రంతో ఈస్టార్ కపుల్ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. ఐదేండ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వీరి వివాహం కొంతమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఆతర్వాత గౌతమ్ ఘట్టమనేని, సితారకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాపైనే ఫోకస్ పెట్టారు. ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తున్నారు. నమ్రతా తమ వ్యాపారాలను చూసుకుంటున్నారు. 
 

Latest Videos

click me!