Lata Mangeshkar Net Worth: స్వర కోకిల లతా ఆస్తుల విలువెంతో తెలుసా? లగ్జరీ కార్లు.. వివరాలు..

Published : Feb 06, 2022, 12:03 PM IST

ఇండియాలోనే రిచెస్ట్ మ్యూజికల్‌ సింగర్‌గా ఎదిగారు లతా మంగేష్కర్‌. ఆమె మోస్ట్ పాపులర్‌ వరల్డ్ మ్యూజిక్‌ సింగర్‌గా గుర్తింపు పొందారు. 

PREV
16
Lata Mangeshkar Net Worth: స్వర కోకిల లతా ఆస్తుల విలువెంతో తెలుసా? లగ్జరీ కార్లు.. వివరాలు..

స్వర కోకిల, నైటెంగేల్‌ ఆఫ్‌ ఇండియాగా భారతీయ సంగీతంలో తనకంటే ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న లతా మంగేష్కర్‌ జీవితం ఆటుపోట్లతో ప్రారంభమైంది. తండ్రి మరణంతో ఆమె కుటుంబ బాధ్యతలు ఎత్తుకోవాల్సి వచ్చింది.  1942లో లత తండ్రి గుండె జబ్బుతో చనిపోయినప్పుడు  ఆమెకి 13 ఏళ్లు. కుటుంబ భారం లతపై పడింది. డబ్బులొస్తాయంటే `కితి హసాల్` సినిమాలో ఒక పాట పాడింది. `నాచు యా గావో` అనే మరాఠీ పాట అది. డబ్బులొచ్చాయి. కానీ పాటే.. సినిమాలో లేదు. కట్ అయింది! ఆ పసి మనసు ఉసూరుమంది.
 

26

 తండ్రి పోయిన ఏడాది.. లతకు ఇంకో చాన్స్ వచ్చింది. `పెహలీ మంగళ గౌర్` అనే మరాఠీ సినిమాలో చిన్న పాత్ర. దాంతో పాటే చిన్న పాట. తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్‌కి  సినిమా కంపెనీ ఉంది. ఆయన ఇచ్చిన అవకాశం ఇది. అవకాశంతో పాటు, కొంత డబ్బు కూడా వచ్చింది. లత  హిందీ కెరీర్ కూడా మరాఠీ చిత్రం నుంచే మొదలైంది. తొలిసారి 1943లో `గజాభావ్` అనే మరాఠీ చిత్రంలో `మాతా ఏక్ సపూత్ కి దునియా బదల్ దే తు` అనే హిందీ పాట పాడారు లత.
 

36

 తర్వాత రెండేళ్లకు మాస్టర్ వినాయక్ కంపెనీతో పాటు ఇండోర్ నుంచి బొంబాయికి వచ్చేసింది లత ఫ్యామిలీ. బొంబాయికి రాగానే లత చేసిన మొదటి పని.. హిందూస్తానీ సంగీతంలో మెళుకువల కోసం ఉస్తాద్ అమానత్ అలీ ఖాన్ దగ్గర చేరడం. స్వరాలతో గొంతు శ్రావ్యమైతే.. పాటలు వరాలై కురుస్తాయని లత ఆశ. ఈ సంగీతంలో పట్టుసాధించిన లతా ఆ తర్వాత పూర్తి స్థాయి సింగర్‌గా మారిపోయారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఏడు దశాబ్దాలు పాటు పాటకి అంకితమయ్యారు. పాటల ప్రవాహాన్ని సృష్టించారు. యాభై వేల వరకు పాటలు పాడి ఆకట్టుకున్నారు. 
 

46

ఇండియాలోనే రిచెస్ట్ మ్యూజికల్‌ సింగర్‌గా ఎదిగారు. ఆమె మోస్ట్ పాపులర్‌ వరల్డ్ మ్యూజిక్‌ సింగర్‌గా గుర్తింపు పొందారు. అయితే ఒకప్పుడు ఇళ్లు గడవడానికి పాటలు పాడిన లతా.. ఆ తర్వాత లెజెండరీ సింగర్‌గా ఎదిగారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రిచెస్ట్ సింగర్‌గా అవతరించారు. లగ్జరీ హౌజ్‌, లగ్జరీ కార్లు సంపాదించారు. అనేక ఆస్తులను కూడగట్టుకున్నారు.

56

మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా సంపాదన.. ఇప్పుడు వంద కోట్లకుపైగా చేరుకుంది. ప్రస్తుతం లతా ఆస్తి విలువ 111 కోట్లు (15మిలియన్స్ డార్లు) ఉంటుందని ఇటీవల ఓ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. అయితే ఇంత ఆస్తి ఆమె తాను ఎంతో కష్టపడి, డెభ్బై ఏళ్లు పాటకి అంకితమై సంపాదించారు. ఒక్కోరూపాయి కూడబెట్టుకుని రిచెస్ట్ సింగర్‌గా అవతరించారు. ఇప్పటికే ఆమెకు ఏడాదికి సుమారు ఆరు కోట్ల వరకు సంపాదన తన పాటలు, ఆల్బమ్స్, ఆస్తుల ద్వారా పొందుతుందని సమాచారం. 

66

ప్రస్తుతం లతా మంబయిలోని `ప్రభు కుంజ్‌` అనే ఇంట్లో నివసిస్తుంది. ఇది పది ఫ్యామిలీ నివసించేంత పెద్దగా ఉండటం విశేషం. ఇక కార్ల విషయానికి వస్తే.. ఆమె కెరీర్‌ బిగినింగ్‌లో చెవ్రోలెట్‌ కారుని వాడారు. ఆ తర్వాత మెర్సిడెస్‌ బెంజ్‌. అలాగే క్రిస్లెర్‌ కారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories