Latha Mangeshkar Family : లెజెండరీ సింగర్ ‘లతా మగేష్కర్’ ఫ్యామిలీ.. సంగీతమంటే అందరికీ ప్రాణమే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 06, 2022, 11:31 AM ISTUpdated : Feb 06, 2022, 11:33 AM IST

కోట్లమందికి ఆరాధ్య గాయకురాలిగా మారిన బాలీవుడ్ స్వర దిగ్గజం లతా మంగేష్కర్ ఈ ఉదయమే తుదిశ్వాస విడిచారు. నైటేంగిల్ ఆఫ్ బాలీవుడ్ లతాజీ  కుటుంబ సభ్యుల వివరాలు, తన జన్మస్థలం, ఆమె జీవితంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం.   

PREV
17
Latha Mangeshkar Family : లెజెండరీ సింగర్ ‘లతా మగేష్కర్’ ఫ్యామిలీ..  సంగీతమంటే అందరికీ  ప్రాణమే..

 70 ఏండ్ల పాటు సుధీర్ఘంగా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన లతాజీ కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుసుకుందాం. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు ‘దీనానాథ్ మంగేష్కర్- శేవంతి’దంపతులకు   1929 సెప్టెంబర్ 28న జన్మించారు లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ తోబుట్టువులు మొత్తం ఐదుగురు. వీరిల లతాజీ పెద్దది. ఈవిడ తర్వాత ‘ఆశా బోస్లే’, ‘ఉషా మంగేష్కర్’,‘మీనా ఖాదీకర్’, ‘హ్రుదయనాథ్’ మంగేష్కర్ జన్మించారు. 

27

లతాజీ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ శాస్త్రీయ గాయకుడు, అలాగే నాటక నటుడు. ఆమె తల్లి, బొంబాయి ప్రెసిడెన్సీ థాల్నేర్‌కు చెందిన గుజరాతీ మహిళ శేవంతి... రెండవ భార్యగా దీనానాథ్ ను వివాహాం చేసుకుంది. కాగా  దీనానాథ్ మొదటి వివాహం నర్మదతో జరిగింది. ఆ తర్వాత శేవంతిని వివాహా మాడి వీరి ఐదుగురికి జన్మనిచ్చారు.  

37

తండ్రి మరణంతో 13 ఏళ్లకే సింగర్ గా మారిన లతా మంగేష్కర్... తన మొదటి సాంగ్ మరాఠి చిత్రం కోసం 1942లో పాడారు. అయితే ఈ సాంగ్ ఆ మూవీ ఆల్బంలో పొందుపరచలేదు. అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది. భాషాబేధం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు. కెరీర్ లో లతా మంగేష్కర్ పాడినన్ని పాటలు మరో సింగర్ పాడలేదు. ఇది ప్రపంచ రికార్డు కూడాను. ఐదారు  తరాల బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు. 
 

47

లతా మంగేష్కర్ భారతదేశంలోని ప్రసిద్ధ, అత్యంత గౌరవనీయమైన ప్లే బ్యాక్ సింగర్లలో ఒకరు. ఆమెకు సంగీతం పట్ల ఉన్న మక్కువతో  వివాహాం కూడా చేసుకోలేదు. ఆమె సంగీత మాధుర్యానికి మంత్రముగ్దులై... ఆమెను బాలీవుడ్ నైటింగేల్ అని ముద్దుగా పిలుస్తారు. ఆమెకు 2001లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.

57

ఆశా భోంస్లే లతాజీ ఇష్టమైన సోదరి. ఆశా భోంస్లే కూడా బాలీవుడ్ లో ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రసిద్ధి పొందారు. అయినప్పటికీ ఆమెకు పెద్ద మొత్తంలోనూ  కచేరీలు కూడా ఉన్నాయి. 16 ఏండ్లలోనే ఆశా బోంస్లే 31 ఏళ్ల గణపత్రావ్ భోంస్లేతో కలిసి పారిపోయింది. ఆ తర్వాత 1960లో విడిపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు, ఐదుగురు మనువరాళ్లు ఉన్నారు. ఆమె ముగ్గురు పిల్లలలో పెద్దవాడు, హేమంత్ భోంస్లే సంగీత దర్శకుడిగా మారిన  తర్వాత స్కాట్లాండ్‌కు వెళ్లాడు. ఆయన కూడా సెప్టెంబర్ 2015లో మరణించాడు. భోంస్లే కుమార్తె వర్ష కూడా  అక్టోబర్ 2012న ఆత్మహత్య చేసుకుంది.  
 

67

లతా మంగేష్కర్ రెండో చెల్లేలు ఉషా మంగేష్కర్. ఈమె కూడా అనేక హిందీ, మరాఠీ, బెంగాలీ, నేపాలీ, భోజ్‌పురి, గుజరాతీ పాటలను రికార్డ్ చేసింది.  ఈమె కూడా సంగీతం పట్ల ఉన్న గౌరవంతో  అవివాహితగానే మిగిలిపోయింది. అదేవిధంగా మీనా ఖాదికర్ కూడా మరాఠీ, హిందీ భాషల్లో ప్లేబ్యాక్ సింగర్ గా ప్రసిద్ధి చెందారు. ఈమె ఎక్కువగా పిల్లల పాటలను కంపోజ్ చేసి పాపులారిటీని సొంత చేసుకుంది. ఈమె కొడుకు పేరు యోగేష్ ఖాదికర్. ఈయన మీనా పాడిన కొన్ని పాటలను రికార్డ్ చేశారు.  
 

77


ఇక హృదయనాథ్ మంగేష్కర్ లతా మంగేష్కర్ తోబుట్టువులలో చివరి వాడు. 
ఈయన కూడా ప్లేబ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరాఠీ హాస్యనటుడు దామున్నా మల్వంకర్ కుమార్తె భారతి మల్వంకర్ మంగేష్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఆదినాథ్ మంగేష్కర్, బైజ్నాథ్ మంగేష్కర్  ఇద్దరు కుమారులు, కూతురు రాధా మంగేష్కర్ ఉంది.  

click me!

Recommended Stories