Lata Mangeshkar: 1962లో ఇండియా, చైనా వార్.. నెహ్రూ గారికే కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 06, 2022, 10:13 AM IST

ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.

PREV
17
Lata Mangeshkar: 1962లో ఇండియా, చైనా వార్.. నెహ్రూ గారికే కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్

ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. 

27

ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. కాగా కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లు బీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మృతితో దేశవ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

37

దీనితో ఆమె జీవితంలో సాధించిన ఘనతలు, మధురమైన సంఘటనలని అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. లతా మంగేష్కర్ కెరీర్ చాలా సుదీర్ఘమైనది. ఆమె 1929లో జన్మించారు. 1940 దశకం నుంచే పాటలు పాడడం మొదలు పెట్టారు. 

 

47

లతా మంగేష్కర్ మధుర గాత్రానికి ముగ్ధులు కానీ ప్రముఖులు అంటూ లేరు. 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి ముందు లతా మంగేష్కర్ పాడిన పాటని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. 1963, జనవరి 27న లతా మంగేష్కర్ ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో నెహ్రూ సమక్షంలో 'ఏ మేర వతన్ లగాన్' అనే దేశభక్తి పాటని పాడారు. 

57

1962లో ఇండియా చైనా వార్ లో మరణించిన సైనికులకు నివాళిగా ఆ పాట రాయబడింది. నెహ్రు సమక్షంలో పడాలని లతా మంగేష్కర్ కి కేవలం కొన్ని రోజుల ముందే చెప్పారట. ఆమె కంగారుతో కుదరదు అనే చెప్పిందట. కానీ ఆమెని రిక్వస్ట్ చేసి ఒప్పించారు. 

67

ఆ కార్యక్రమానికి ముందు లతా కేవలం ఒక్కసారి మాత్రమే రిహార్సల్స్ చేశారట. ఆ కార్యక్రమంలో లతా అద్భుతంగా ఆ పాటని పాడారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నెహ్రూ గారు మిమ్మల్ని కలవాలని అంటున్నారు అని ఎవరో చెప్పారు. దీనితో నేనేమైనా పొరపాటు చేశానా? పాట సరిగ్గా పడలేదా ? అని ఆమె కంగారు పడిపోయిందట. 

77

కానీ నెహ్రూ గారిని కలిసిన తర్వాత ఆయన లతా మంగేష్కర్ ని ప్రశంసించడం మాత్రమే కాదు.. భావోద్వేగానికి గురై కన్నీరు కూడా పెట్టుకున్నారట. ఇది లతా మంగేష్కర్ జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన. ఆమె నిజమైన భారత రత్నం. భౌతికంగా లతా మంగేష్కర్ దూరమైనప్పటికీ..  అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 

Read more Photos on
click me!

Recommended Stories