Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ తొలి తెలుగు పాట ఏ సినిమాలో తెలుసా?.. ఆమె పాడిన పాటలు తెలిస్తే షాకవ్వాల్సిందే

Published : Feb 06, 2022, 09:56 AM ISTUpdated : Feb 06, 2022, 10:05 AM IST

ఏడు దశాబ్దాలు లతా మంగేష్కర్‌ సంగీత ప్రపంచంలోనే, పాటల ప్రవాహంలోనే మునిగి తేలడం విశేషం. ఆమె గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 

PREV
17
Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ తొలి తెలుగు పాట ఏ సినిమాలో తెలుసా?.. ఆమె పాడిన పాటలు తెలిస్తే షాకవ్వాల్సిందే

మెలోడీ క్వీన్‌ లతా మంగేష్కర్‌ అద్భుతమైన పాటలతో భారతీయ శ్రోతలను మెప్పించింది. సినీ ప్రియులను అలరించింది. దాదాపు ఇరవై భారతీయ భాషల్లో ఆమె 50 వేలకుపైగా పాటలు పాడి మెప్పించింది. అద్భుతమైన గాత్రంతో సినీ ఆడియెన్స్ ని ఒలలాడించారు. ఏడు దశాబ్దాలు లతా మంగేష్కర్‌ సంగీత ప్రపంచంలోనే, పాటల ప్రవాహంలోనే మునిగి తేలడం విశేషం. ఆమె గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 

27

93ఏళ్ల లతా మంగేష్కర్‌ గత కొంత కాలంగా సినిమా పాటలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్ల క్రితం ఆమె ఇండియన్‌ ఆర్మీకి అంకితమిస్తూ `సౌగంద్‌ ముజే ఈజ్‌ మిట్టి కీ` అనే పాటని ఆలపించారు. ఈ పాటని మయురేష్‌ పాయ్‌ కంపోజ్‌ చేశారు. ఇదే ఆమె పాడిన చివరి పాటగా చెప్పొచ్చు. అంతకు ముందు `ఎల్‌ఎం మ్యూజిక్‌` పేరుతో మ్యూజిక్‌ లేబుల్‌ని కూడా ప్రారంభించారు. తన స్పెషల్‌ ఆల్బమ్‌లు రూపొందించారు. అందులో `స్వామి సమర్త్ మహ మంత్ర` అనే ఆల్బమ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇందులో తన సిస్టర్‌ ఉషాతో కలిసి ఆమె ఆలపించారు. 

37

ఇదిలా ఉంటే హిందీలో వేల పాటలు పాడిన లతా మంగేష్కర్‌ తెలుగులో మాత్రం కేవలం మూడే పాటలు పాడటం గమనార్హం. పూర్తి బాలీవుడ్‌కే పరిమితమయ్యిందీ గాన సరస్వతి. బాలీవుడ్‌లో ప్రధానంగా ఫీమేల్‌ సింగర్స్ లో లతా మంగేష్కర్‌ పాటలే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. హిందీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్‌ కీలక భూమిక పోషించారు. ఇంకా చెప్పాలంటే హిందీ పాటలను ఐదు దశాబ్దాల పాటు ఏక చత్రాధిపత్యంగా ఏలారు. నార్త్ ఆడియెన్స్ మదిలోని నిలిచిపోయారు. 

47

లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ తెలుగులో ఆమె కేవలం మూడంటే మూడు పాటలే పాడటం మన దురదృష్టం అనే చెప్పాలి. తెలుగులో ఆమె ఎక్కువ పాటలు పాడకపోవడానికి కారణం ఏంటనేది అంతు పట్టని విషయంగా మారింది.

57

ఇక ఆమె పాడిన తొలిపాట `సంతానం` చిత్రంలో పాడారు. 1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా.. సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన `సంతానం` చిత్రంలో `నిదురపోరా తమ్ముడా` లతా పాడిన తొలి తెలుగు పాట. 1955 ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదలైంది. లత పాడిన `నిదురపోరాతా తమ్ముడా..` పాట సూపర్ పాపులర్ అయ్యింది.
 

67

తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిగా సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన `దొరికితే దొంగలు` సినిమాలో `శ్రీ వేంకటేశా..` అనే గీతాన్ని ఆలపించిన లతా మంగేష్కర్ చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన `ఆఖరి పోరాటం` సినిమాలోని `తెల్లచీరకు` పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. 2009లో వచ్చిన `జైల్` సినిమాలోని `డాటా సున్ లే` అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు.

77

 2010 నుంచి వచ్చిన పాటల్లో వినదగ్గ సాహిత్యం లేదని, పైగా బూతు పాటలు ఎక్కువవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సినిమాలకు పాటలు పాడటం ఆపేశానని తెలిపారు. భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో లతాజీను సత్కరించింది. మూడు జాతీయ అవార్డులు, అనేక ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాలు, ఇతరరాష్ట్రాల అవార్డులు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆమెని వరించాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories