ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నందు, లాస్యతో, సామ్రాట్ మొండిగా తులసిని తీసుకురామంటారు,ఈ తులసి అంతకన్నా మండిది నేను రాను పొమ్మంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిమ్మకాయ పిండినట్టు నేను అరిగిపోతున్నాను,అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు.అప్పుడు లాస్య ఒక ప్లాన్ చెప్తుంది దానికి నందు ఇలా చేస్తే దొరికిపోతాము అని అనగా ఎవరు చెప్తారు చెప్పు! ఎవరు చెప్పనంతవరకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో నందు ఇంటికి వచ్చి మాట్లాడిన విషయం అంతా గుర్తు తెచ్చుకున్న అభి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో తులసి, అంకితలు అక్కడికి రాగా అమ్మ,నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అభి అంటాడు.