Intinti Gruhalakshmi: మితిమీరిన లాస్య దౌర్జన్యం.. తులసిని హెచ్చరిస్తున్న రాజ్యలక్ష్మి?

First Published Jun 2, 2023, 8:47 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో విక్రమ్ దంపతులను విడదీస్తున్నాం అనుకొని మరింత దగ్గర చేస్తున్నమేమో అని అనుమానంగా ఉందక్క అంటాడు బసవయ్య. నిజమే భార్యాభర్తల మధ్య ఎంతని కాపలా కాస్తాం అసహ్యంగా ఉంటుంది అంటుంది బసవయ్య భార్య. చాటుమాటుగా యుద్ధం ఎంతసేపని చేస్తాం. దివ్య కూడా యాక్టివ్ అయింది. తనకి తండ్రి మీద ఉన్న ప్రేమ తనకి శత్రువు లాగా మారబోతుంది.

అస్తమానం తన తండ్రి కోసం పరిగెడుతుంటే ఈ అవకాశాన్ని వాడుకొని మనం వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచొచ్చు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఒంటరిగా ఉన్న తులసి దగ్గరికి వచ్చి నువ్వే దిగులు పడిపోతే ఎలా.. అత్తమామలకి ధైర్యం ఎవరు చెప్తారు అంటాడు మాధవి భర్త. వాళ్ళ కొడుకుని వాళ్ళ చేతుల్లో పెడతానని మాట ఇచ్చాను మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాను అన్నయ్య.
 

అయినా తప్పు చేయకుండానే ఎందుకు ఆ దేవుడు శిక్ష వేస్తున్నాడు అంటుంది తులసి. లాస్య పట్ల తప్పు చేయకపోవచ్చు కానీ నీ పట్ల చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా లాస్య చిన్న తప్పు చేసిందన్న సాక్ష్యం దొరికితే చాలు మళ్ళీ కేసు రీ ఓపెన్  చేయొచ్చు అంటాడు మాధవి భర్త. అంటే దారులన్నీ మూసుకుపోలేదన్నమాట ఇప్పుడు నాలో ధైర్యం వచ్చింది అంటుంది తులసి.
 

మరోవైపు తండ్రిని తలుచుకొని బాధపడుతుంది దివ్య. చిన్నతనంలో తండ్రికి దూరమై బాధపడ్డాను ఇప్పుడు ఈ విధంగా దూరమవుతున్నాను ఐదు సంవత్సరాలు నాన్నని చూడకుండా ఉండడం అంటే నావల్ల జరగని పని అనుకుంటూ తల్లికి ఫోన్ చేస్తుంది దివ్య. నాకు నాన్నని చూడాలని ఉంది. నేను ఇప్పుడే జైలుకు వెళ్తున్నాను నువ్వు కూడా అట్నుంచి రా అంటుంది.
 

ఇప్పుడు వద్దు నాన్న గిల్టీగా ఉంటారు మనతో సరిగ్గా మాట్లాడలేరు అని తల్లి చెప్పినా వినిపించుకోదు. ఫోన్ పెట్టేసిన తర్వాత చెప్పిన మాట వినటం లేదు అస్తమానం ఇలా పరిగెట్టుకొని వస్తే అత్తింట్లో ఏమైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు పడుతుంది తులసి. ఆ తర్వాత అమ్మ వచ్చేస్తూ ఉంటుంది నేను త్వరగా వెళ్ళాలి అనుకుని విక్రమ్ కోసం చూస్తుంది దివ్య. తను ఎక్కడా కనిపించకపోవడంతో ప్రియ ని అడుగుతుంది.
 

కారు సర్వీసింగ్ కి ఇచ్చారు. తీసుకురావడానికి వెళ్లారు అని చెప్తుంది ప్రియ. ఆయన వస్తే నేను బయటకు వెళ్లాను అని చెప్పు ఫోన్ చేస్తాను అన్నానని కూడా చెప్పు అంటూ హడావిడిగా బయలుదేరి పోతుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ఎదురొస్తాడు బసవయ్య. చెప్తే ఒక సమస్య చెప్పకపోతే ఒక సమస్య అని మనసులో అనుకుంటుంది దివ్య. ఎవరి పనులు వారికి ఉంటాయి బాబాయ్ అన్నీ చెప్పలేము కదా అట్నుంచి వచ్చాక చెప్తాను అంటుంది దివ్య.
 

ఇంతలోనే రాజ్యలక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ భర్తకి తల్లిని. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు చెప్పి నేను పర్మిషన్ ఇస్తేనే బయటకు వెళ్ళాలి అంటుంది. మా నాన్నగారిని చూడడానికి వెళ్తున్నాను అంటుంది దివ్య. నువ్విలా అస్తమానం జైలుకు వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వెళ్లడానికి నేను ఒప్పుకోను అంటుంది రాజలక్ష్మి.

నాకు ఎవరి పర్మిషన్తోను పనిలేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య. రాజ్యలక్ష్మి నవ్వుతుంది. ఏంటి నిన్ను కరివేపాకుని తీసేసినట్లు తీసేస్తుంటే నవ్వుతున్నావు అని ఆయమయంగా అడుగుతాడు బసవయ్య. నాకు కావలసింది కూడా ఇదే. దీన్నే ఇప్పుడు పెద్ద సమస్యను చేస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. సీన్ కట్ పరంధామయ్య దంపతులు, తులసి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇంతలో లాస్య వస్తుంది. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అనసూయ. ఇది నా ఇల్లు అంటూ తన గదిలోకి వెళ్లబోతుంది లాస్య. ఎక్కడికి వెళ్తున్నావు.. ఇలా దౌర్జన్యం చేస్తే నేను ఊరుకోను నామీద అగ్రహించ పెట్టలేవు కదా అంటుంది తులసి. నీకు తెలియదేమో భర్తతోపాటు అత్తమామల మీద ఆడపడుచుల మీద మాజీ భార్యల మీద కూడా కేసు పెట్టొచ్చు జాగ్రత్త అని హెచ్చరించి దౌర్జన్యంగా తన గదిలోకి వెళ్లి ఏవో వెతుకుతుంది.

ఏం వెతుకుతున్నావు అంటుంది తులసి. ఏమి మాట్లాడకుండా పరుపు కింద దొరికిన కెఫే డాక్యుమెంట్స్ తీసుకుంటుంది లాస్య. వాటితో నీకేం పని అంటుంది తులసి. కేఫ్ నా భర్త పేరుమీద ఉంది వారసత్వంగా అది నాకే సంక్రమిస్తుంది అంటుంది లాస్య. తరువాయి భాగంలో రాజ్యలక్ష్మి తులసికి ఫోన్ చేసి మీ అమ్మాయికి తండ్రి మీద ఉన్న ప్రేమతో అస్తమానం బయటకు వచ్చేస్తుంది. ఈ విషయం విక్రమ్ కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ హెచ్చరించినట్లుగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి.

click me!