Intinti Gruhalakshmi: గెలుపు కోసం ప్రేమ్‌కు తులసి దైర్యం.. మరో కుట్ర ప్లాన్ చేసిన లాస్య!

Published : Jul 08, 2022, 09:44 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జులై 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Intinti Gruhalakshmi: గెలుపు కోసం ప్రేమ్‌కు తులసి దైర్యం.. మరో కుట్ర ప్లాన్ చేసిన లాస్య!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నందుతో లాస్య మాట్లాడుతూ రేపు సింగింగ్ కాంపిటిషన్ ఉంది.. వెళదాం పదా అంటే మూడ్ బాలేదని చెప్తాడు. అయిన వినకుండా వెళదాం పదా అని అంటే సరే అంటాడు. ఇక మరో సీన్ లో ప్రేమ్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు తులసికి సంజనా ఫోన్ చేస్తుంది. మీ ప్రేమ్ ఇంకా నన్ను కలవలేదు అని చెప్తుంది. తను ప్రిపేర్ అవుతున్నాడు నమ్మకం పెట్టుకోండి అని ఫోన్ కట్ చేస్తుంది. 
 

26

అప్పుడు తులసి.. గతంలో ప్రేమ్ రాసిన పాటల డైరీ చూసి నీకు చాలా టాలెంట్ ఉంది.. నువ్వు ఎందుకు ఏం చెయ్యలేకపోతున్నట్టు ఫీల్ అవుతున్నావ్.. నేను నీ దగ్గర లేనందుకే నువ్వు ఇలా అయ్యావా అని అనుకుంటుంటే అవును ఆంటీ మీ వల్లే ఇలా అయ్యాడు.. మీరు తనవైపు ఉంటే తను విజయం సాధిస్తాడు అని చెప్తుంది. మీరు ఎప్పుడు ప్రేమ్ కు బలమే బలహీనం కాదు అని అంకిత చెప్తుంది.
 

36

ప్రేమ్ పక్కనే ఉండి ప్రేమ్ లో దైర్యం నింపాలి అని అక్కడకు వెళ్తుంది. నువ్వు గెలిచిన తర్వాతే నీ ముందుకు వద్దాము అనుకున్నాను కానీ నువ్వు ఇంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయావ్ అని ప్రేమ్ తో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తుంది. అమ్మ అంటే నీకు ప్రాణం, ప్రపంచం అని నాకు తెలుసు ప్రేమ్ కానీ నువ్వు కష్టాన్ని దైర్యంగా ఎదురించాలి అప్పుడే విజయం సాధిస్తావ్ అని చెప్తుంది. కానీ నా మనసు నన్ను ఆపేసింది.. బ్రతికున్న శవంలా అనిపించాను అని అంటాడు.
 

46

నీకు నేనున్నాను ప్రేమ్ అని అతనికి దైర్యం ఇస్తుంది. అమ్మ ఒక్కసారి నేను నీ బుజంపై తల పెట్టుకోవచ్చా అని ప్రేమ్ అడిగితే రా నాన్న అని పిలిస్తుంది. ప్రేమ్, తులసి కన్నీళ్లు పెడుతూ.. నువ్వు నా కల నెరవేర్చాలి అని అంటే.. నేను కచ్చితంగా విజయం సాధిస్తాను అమ్మ అని చెప్తాడు. ఇక మరుసటి రోజు పాట పోటీలో కుటుంబం అంతా ఉంటారు. కుటుంబంలో అందరూ ప్రేమ్ గురించి గొప్పగా మాట్లాడుతారు.
 

56

ఇక అప్పుడే సీన్ లోకి అభి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు రేయ్ ప్రేమ్ మూడ్ పాడు చేసుకోకుండా లోపలికి వెళ్ళు అంటే.. తులసి ఏమైంది మామయ్య అలా అన్నావ్ అంటే.. ఎందుకో ఈ అభి ప్రేమ్ మంచికోరి వచ్చినట్టు కనిపించడం లేదు అంటాడు. అప్పుడు అభి ప్రేమ్ కు అల్ ది బెస్ట్ చెప్తాడు.. నువ్వు అదృష్టవంతుడువి నీ మంచి కోరే మీ అమ్మ దగ్గర ఉన్నావ్ అని తులసిని ఇన్ డైరెక్ట్ గా అంటాడు.
 

66

ఇక ఆ ఈవెంట్ కు లాస్య, నందు, భాగ్య కలిసి వస్తారు.. నిన్నటి వరకు దూరంగా ఉన్నా తులసి ఇప్పుడు ఏంటి ప్రేమ్ చెయ్యి పట్టుకొని వస్తుందని లాస్య అనుకుంటుంది. ఇద్దరు ఎదురుపడి మీ తల్లికొడుకుల బంధం ఉన్నట్టు ఈ ప్రపంచంలో ఎవరిది ఉండదు అన్నట్టు వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు దివ్య కూడా వెటకారంగా లక్కీ గురించి చెప్తుంది. ఆ మాటలు విన్న లాస్య నిన్ను ఓడిపోయేలా చేస్తా అని అనుకుంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories