Intinti Gruhalakshmi: లాస్యను రెచ్చగొట్టిన గాయత్రి.. తులసి నందుని అపార్థం చేసుకున్న లాస్య?

First Published Feb 8, 2023, 9:05 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ తులసిని నవ్వించడం కోసం పాటలు పాడుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ సరదాగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి అభి వచ్చి తులసికి ఎదురుగా నిలబడి లెంపలు వేసుకొని గుంజీలు తీస్తాడు. అప్పుడు అవి తులసి ఇద్దరు హత్తుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు నందు సంతోషపడుతుండగా లాస్య ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ప్రేమ్ పాట పాడుతూ ఉండగా అభి తులసి అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. అంతలోనే కోప్పడతాడు అంతలోనే ప్రేమ చూపిస్తాడు ఏంటో ఈ అభి అసలు అర్థం కాడు అనడంతో అదే ఉమ్మడి కుటుంబాలు అంటే అప్పుడప్పుడే కోపాలు అప్పుడే సంతోషాలు అంటాడు నందు.
 

ఆ తర్వాత లాస్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కాఫీ కేఫ్ ఓపెన్ చేయడానికి వెళ్ళగా అప్పుడు గాయత్రి కావాలనే రిబ్బన్ కటింగ్ పెట్టారు అంటే ఎవరు విఐపి వస్తున్నారా అని అనడంతో తులసి ప్రేమ్ శృతి వాళ్ళందరూ ఎవరో విఐపి వస్తున్నట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడు లాస్య నాకు తెలియకుండా ఎవరిని పిలిచి ఉంటారు ఎక్కడ ఉన్నారు అని అనడంతో పక్కనే పెట్టుకుని ఎక్కడ అంటావ్ ఏంటి లాస్య వాళ్ళు ఎవరో కాదు అత్తయ్య మామయ్య అనడంతో అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అమ్మ నాన్న మీ చేతుల మీదుగా కేక్ ఓపెన్ చేయండి అనడంతో పరంధామయ్య, అనసూయ ఇద్దరు కలిసి రిబ్బన్ కటింగ్ చేస్తారు. తర్వాత అనసూయ రామ్మ తులసి టెంకాయ కొట్టు అని అనడంతో అత్తయ్య గారు టెన్షన్ పడకండి.
 

ఈ కేఫ్ కి ఓనర్ నందు నేను ఆయన భార్యని మొదటి నేను కొట్టి తర్వాత నందు కొట్టిన తర్వాత మళ్లీ గెస్ట్ లు టెంకాయ కొట్టాలి అని అంటుంది లాస్య. అప్పుడు తులసి సరే అని అనడంతో లాస్య అక్కడికి వచ్చి వంకరగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే తులసి నీ బుద్ధిని ఆ దేవుడు కూడా మార్చలేడు అని అంటుంది. తర్వాత లాస్య మొదటి టెంకాయ కొట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత తులసి పరంధామయ్య వాళ్ళు టెంకాయ కొట్టి లోపలికి వెళ్తారు. తర్వాత అందరూ లోపలికి వెళ్ళగా అప్పుడు గాయత్రీ నేను చెప్పిన విషయం గురించి ఏం చేశావు అనడంతో నేను మొండిగా మాట్లాడితే అంకిత మరింత మొండిగా మాట్లాడుతుంది ఆంటీ అనడంతో అయితే డాక్టర్ వృత్తి మానేసి బయట ఏదైనా కాకా హోటల్ పెట్టుకో మీ డాడికి నీకు ఇద్దరికీ సరిపోతుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది గాయత్రి.

 ఆ తర్వాత నందు అక్కడ హోటల్లో వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ ఉండగా ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు. థాంక్స్ దీపక్ వచ్చినందుకు ఉండడంతో నాకు రావాలని లేదు కానీ అక్క కోప్పడుతుందని వచ్చాను ఇదిగో మా అమ్మ మీకోసం తన చేత్తో తయారు చేసిన పచ్చళ్ళు మసాలా పొడులు పంపించింది అని అంటాడు. ఆ తర్వాత లాస్య హోటల్లో చైర్స్ అన్ని సర్దుతూ ఉండగా ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చి కంగ్రాట్యులేషన్స్ లాస్య నీకు జాబ్ లేదని బాధపడకు మీ ఆయన కేఫ్ లో ఏదో ఒక పని చేసుకుని ఉండొచ్చు. వంట రాకపోయినా ఏదో ఒక పని చేయొచ్చులే అని అనడంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీలాంటి పిచ్చి పిచ్చి మాటలు తులసి దగ్గర మాట్లాడు నా దగ్గర కాదు అని లాస్య అనడంతో నువ్వు కూడా నీ కోపం అంతా తులసి దగ్గర చూపించు నా దగ్గర కాదు అంటుంది గాయత్రి.
 

 నేను పని చేయాల్సిన అవసరం నాకేముంది ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని దజ్జాగా కూర్చుంటాను అనడంతో అయ్యో పిచ్చిదానా నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ మీ ఆయన మీద నాకు నమ్మకం లేదు అంటుంది గాయత్రి. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అంటుంది లాస్య. అప్పుడు గాయత్రి కావాలనే లాస్యను రెచ్చగొట్టాలని తులసి నందుల మధ్య ఏదో సంబంధం ఉందని వాళ్ళు ముందులాగే మళ్ళీ కలిసిపోతున్నారు అని అనడంతో లాస్య టెన్షన్ పడుతూ కోపంలో రగిలిపోతూ ఉంటుంది. అక్కడ చూడు మీ ఆయన అ తులసి సమయం దొరికితే చాలు ఒకరితో ఒకరు పగలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అంటుంది గాయత్రి.
 

రోజంతా నువ్వు వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు నీతులు చెప్పడం కాదు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అటు చూడు అనడంతో గాయత్రి అంకిత వైపు చూడగా అంకిత అక్కడ హోటల్లో పనిచేస్తూ ఉండడంతో అది చూసి గాయత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందరికీ సూక్తులు చెప్తుంటే ఇది ఇలా కాఫీలు చేసుకుంటు పరువు తీస్తుంది ఇడియట్ అని అనుకుంటూ ఉంటుంది గాయత్రి. అప్పుడు గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తులసి హారతి ఇస్తూ ఉండగా లాస్య వెళ్లి అడ్డుపడి ఎందుకు తులసి పదేపదే ఇలా చేసి నన్ను రెచ్చగొడుతున్నావు. కేప్ నీ వల్లే వచ్చిందన్న విషయం మాకు తెలుసు కానీ ప్రతి ఒక్క విషయంలో డామినేట్ ఎందుకు చేస్తున్నావు అంటుంది లాస్య.
 

మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ప్రవర్తిస్తున్నావు అని లాస్య తులసిని అపార్థం చేసుకుంటుంది. నందు భార్యను నేను హారతి ఇవ్వాలి కానీ నువ్వు ఎలా ఇస్తావు అనడంతో నువ్వు ఒక గాయత్రితో బాతాకాలు కొడుతున్నావు ఎవరు పిలిచిన రావడం లేదు అందుకే తులసిని హారతి ఇవ్వమని చెప్పాము అంటుంది అనసూయ.  మీరు చెప్పారు సరే తులసికి జ్ఞానం లేదా అని అంటుంది. అప్పుడు నందు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు లాస్య అనడంతో నీకు ఇది చిన్న విషయం కావచ్చు నాకు చాలా పెద్ద విషయం అంటుంది లాస్య. ఇంతలోనే ఒక కస్టమర్ అక్కడికి వచ్చి అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోతాడు. తరువాత లాస్య సంతోషంగా హారతి ఇస్తూ ఉంటుంది.

click me!