
ఈరోజు ఎపిసోడ్లో సరస్వతి, తులసి ఇద్దరూ రేడియోలో పాట వింటూ ఆనంద పడుతూ ఉంటారు. అప్పుడు తులసి ఆ పాట వింటూ సరస్వతి ఒడిలో తల పెట్టుకుని పడుకొని నిద్రపోతుంది. అప్పుడు ఆ పాట విన్న సరస్వతి నువ్వు చెబితే ఏమో అకున్నాను ఇప్పుడు నీ చిన్నతనంలోకి వెళ్లిపోవాలని ఉంది. వీటిని తులసి ఆ పాట వినగానే ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది అమ్మ అని అంటుంది. అప్పుడు అవును ఇది ఎక్కడికి వచ్చింది అని తులసి సరస్వతి అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి దానంతటతాది ఎలా వస్తుందండి. మనం తీసుకురావాలి అని అంటాడు.
అది మీకంటే ఎంతో ఇష్టమైన తులసి గారు చెప్పారు అందుకే దానిని రిపేర్ చేపించాను అనగా ఆ పాట వినగానే ప్రాణం లేచివచ్చినట్టు అయ్యింది అని అంటుంది సరస్వతి. ఇది చాలా మధురమైన జ్ఞాపకం. అప్పుడు సామ్రాట్, సరస్వతి మాట్లాడుకుంటూ ఉంటారు. సరస్వతి సామ్రాట్ ని పొగుడుతూ ఉంటుంది. ఈ వయసులో విడాకులు తీసుకున్న నా కూతురు ఎలా ఉంటుందో ఎలా బ్రతుకుతుందో అనుకున్నాను. కానీ ఆ కష్టం తెలియకుండా ఆ బాధ లేకుండా ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు ఉండేలా చేస్తున్నావు నిన్ను దేవుడు అనుకోవాలా స్నేహితుడు అనుకోవాలి ఏమనుకోవాలి అర్థం కావడం లేదు అని సరస్వతి అనడంతో అయ్యో చిన్న చిన్న దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేండి అని అంటాడు సామ్రాట్.
అప్పుడు తులసి కూడా సామ్రాట్ ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు నందు ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి ఇంట్లో ఎవరు ఏమన్నా నందు నా వైపే ఉండాలి అంటే నందు చేతకానితనాన్ని నాకు అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి అని అక్కడికి వెళుతుంది. అప్పుడు అక్కడికి వెళ్లినందుని ఇంటర్వ్యూ గురించి అడగడంతో నందుకు కోప్పడతాడు. అప్పుడు ఇంట్లో సమస్య గురించి నీతో మాట్లాడాలి అని అనగా ఏం మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చావా అని అంటాడు నందు.
అప్పుడు ఇంట్లో ఉండే అవసరాలు అన్ని చెప్పడంతో నందు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఈ సమస్యలన్నీ ప్రేమ్, అభి లకు చెప్పొచ్చు కదా అని నందు అనగా వాళ్లు డాడ్ కి చెప్పమని అంటే అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది లాస్య. నాకు మాత్రం జాబ్ ఉండాలి లాస్య అర్థం చేసుకో అని అనగా ఇంకా ఎన్నాళ్ళు నందు అనడంతో జాబ్ వచ్చేవరకు అని అంటాడు. ఇప్పుడు ఏదో ఒకలా నువ్వే చెయ్ లాస్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సామ్రాట్, తులసి ఇద్దరు ఆఫీసులో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి సామ్రాట్ తనకి గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెబుతూ ఉంటుంది.
అప్పుడు గిఫ్ట్ గురించి సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటుంది తులసి. అప్పుడు తులసి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా నేను సప్రైజ్ పార్టీ ఇస్తాను అని అంటుంది. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పార్టీ ఎలా ఉంటుందో మీకు తెలిసేలా చేస్తాను అని అంటుంది. మరొకవైపు అనసూయ పరందామయ్య టాబ్లెట్స్ గురించి మాట్లాడుకుంటూ రేపటితో అన్ని అయిపోతాయి ఇంకా నీకు టాబ్లెట్ వేసుకోవడానికి ఉండవు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. మన నందుకు చెప్పి మందులు తెప్పించు అని పరంధామయ్య అనడంతో వాడికి ఉద్యోగం లేదు కదండీ అని అంటుంది అనసూయ.
వాడి ఖర్చులకే సరిగా డబ్బులు లేవు మన ఖర్చులు ఏమి తీరుస్తాడు వాడి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తుందండి అని మాట్లాడడంతో అప్పుడు నందు ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు నందు అమ్మానాన్నలను తులసి దగ్గరే ఉంచుంటే బాగుండేది నా దగ్గర ఉంచుకొని అనవసరంగా తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అనసూయ దంపతులు మెడిసిన్స్ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉండగా నందు లోలోపల కుమిలిపోతు ఉంటాడు. అప్పుడు వాళ్లు బతికుండి కూడా అనవసరం అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లోనే ఒక అతను వచ్చి ప్రతి గారు టాబ్లెట్స్ పంపించారు అనడంతో అప్పుడు నందు నీ విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
తులసి నేను ఉండి కూడా లేనట్టే మా అమ్మ నాన్నలను కాపాడుతున్నావ్ థాంక్స్ అని అనుకుంటాడు. ఆ మెడిసిన్స్ తీసుకుని నందు పరంధామయ్య దగ్గరికి వెళ్లడంతో మా మెడిసిన్స్ అయిపోయినట్టు మీకు ఎలా తెలుసు నందు అని అడుగుతాడు. ఇప్పుడు అనసూయ నందు మన గురించి పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని అంటుంది. చెప్పకుండానే అన్ని తెలుసుకుంటాడు అని అంటుంది. అప్పుడు నందు నేను ఆ టాబ్లెట్స్ కొనలేదు మీ కొడుకుకి అంత శక్తి లేదు అని క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే తులసి పరంధామయ్య కు ఫోన్ చేస్తుంది. మావయ్య నేను పంపించిన మందులు అందాయా అని అడగగా అవునమ్మా అని అంటాడు.
అప్పుడు మాకు మందులు అయిపోయిన విషయం కూడా మీకు గుర్తుందా తులసి అనడంతో నేను మీకు దూరమయ్యాను కానీ మిమ్మల్ని మర్చిపోలేదు మామయ్య అని బాధగా మాట్లాడుతుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ తులసి ఇద్దరు రోడ్డుపై సరదాగా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ అవతారం చూసి ఆఫీసులో ఫుల్ హుందాగా ఉంటారు ఇక్కడ చూస్తే నార్మల్ వ్యక్తి లాగా ఉన్నారు అంటే మీ క్రెడిట్ అంతా మీదేనండి అని పొగుడుతూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు.