Intinti Gruhalakshmi: అనసూయ, పరందామయ్యలను అవమానించిన లాస్య.. పార్టీలో తులసికి అవమానం?

First Published Jan 12, 2023, 10:23 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో మరి లేకపోతే ఎప్పుడు లేంది ఈరోజు ఎందుకు ప్రేమ ఉలకబోస్తోంది అనగా అప్పుడు పరంధామయ్య మారిందా అనడంతో మనకు కావాల్సింది అదే కదా అనడంతో పరంధామయ్య వాసన చూసి స్మెల్ ఏమి రావడం లేదే అని అంటాడు. వెంటనే అనసూయ ఆ ముక్కుకి 80 ఏళ్ళు వచ్చాయి దాన్ని ఇంకా నమ్మకండి అని అంటుంది. ఇంతలోనే లాస్య ప్లేట్ లో టమోటా ముక్కలు దోసకాయ ముక్కలు బెండకాయ ముక్కలు తీసుకొని రావడంతో అది చూసి అనసూయ దంపతులు ఆశ్చర్యపోతారు. ఇదేంటి కొత్తగా అని అనసూయ అనడంతో మీరు ఇప్పటినుంచి ఇదే తినాలి లంచ్ టైం లో ఏది తింటే అదే లంచ్ అని అంటుంది లాస్య.

ప్రతిరోజు ఇలాగే తినాలి అనడంతో తిన్న తర్వాత ఇలాంటి తింటానేమో కానీ ఇప్పుడే నేను తినను అని అంటాడు పరంధామయ్య. ఇలాంటివన్నీ మీలాంటి వాళ్లకు డైటింగ్ చేసే పనికొస్తాయేమో కానీ మాకు వద్దులేమ్మా అని అంటుంది అనసూయ. అప్పుడు లాస్య ప్రతిరోజు మీరు ఇలాగే తినాలి ఇప్పటినుంచి డబ్బులు ఆదా చేయాలి అనడంతో ఏం ప్రేమ్ వాళ్లు సంపాదించడం సరిపోడం లేదా అనగా నయా పైసా సంపాదన లేదు కానీ మరి లెక్కలు అడుగుతున్నారు అని వాళ్ళని అవమానిస్తుంది లాస్య. అవే తినండి మీకు ఇవే గతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరొకవైపు సామ్రాట్ తులసి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. 
 

అప్పుడు తులసి పరద్యానంతో ఉండడంతో ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు సామ్రాట్. మనిషి ఇక్కడున్నారు మనసు ఎక్కడో ఉంది అని అనగా అదేం లేదు సామ్రాట్ గారు అని అంటుంది తులసి. మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది అందుకే మిమ్మల్ని ఒక బర్తడే పార్టీకి పిలుచుకుని వెళ్తున్నాను అనగా ఇక్కడ నాకు ఎవరు తెలియదు కదా అనగా నాకు తెలుసు అని అంటాడు సామ్రాట్. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి బర్త్డే పార్టీకి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బర్త్డే పార్టీ కి వెళ్తారు. బర్త్డే పార్టీ ఎవరిది అని తులసి అడగగా మా ఫ్రెండ్ కొడుకుది అని అంటాడు సామ్రాట్. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. 
 

అప్పుడు మన ఫ్రెండ్ రావడంతో మా ఫ్రెండ్ తులసి అనగా నాకెందుకు తెలియదు అంటూ తులసి గురించి అన్ని తెలిసిన వాడిలా మాట్లాడుతాడు. అప్పుడు వాళ్ళని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. మరొకవైపు అనసూయ పరందామయ్య ఇద్దరు వాకింగ్ చేస్తూ అలా బయటకు వస్తారు. కడుపులో ఏం లేదని చెబితే వినలేదు ఇలా వాకింగ్ కి తీసుకొచ్చావు అని పనుందామయ్య అనగా ఆ లాస్య ముఖం చూస్తూ ఉండలేక ఇలా పిలుచుకొని వచ్చాను అని అంటుంది. మరొకవైపు తులసి సామ్రాట్ ఇద్దరు పార్టీలో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత పరంధామయ్య అనసూయ ఇద్దరు ఆ బర్త్డే పార్టీకి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లి తిందాము చాలా ఆకలిగా ఉంది అని అంటాడు పరంధామయ్య.
 

 అప్పుడు అనసూయ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా పరంధామయ్య లోపలికి వెళ్దామని అంటాడు. తర్వాత అనసూయ పరందామయ్యా ఇద్దరు పార్టీ లోపలికి వెళ్తూ ఉంటారు. మరోవైపు తులసి సామ్రాట్ ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరూ చూడకుండా భోజనం ప్లేట్ లో వడ్డించుకుని తింటూ ఉండగా ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆపుతాడు. అప్పుడు ఇంత వయసొచ్చింది బుద్ధి లేదా అంటూ పనుందామయ్యా వాళ్ళని నోటికి వచ్చిన విధంగా తిడుతూ ఉంటాడు. ఇప్పుడు అనసూయ అరవకు ప్లేట్లు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాము అని అంటుంది. అప్పుడు తులసి వాళ్ళని చూసి అక్కడికి వెళుతుంది.
 

అప్పుడు ఆ పార్టీ ఓనర్ అక్కడికి వచ్చి అరవకు ముసలోళ్ళు తింటే నీకు ఏంటి ఇప్పటి రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా కడుపు మాడుస్తున్నారు అని వాళ్ళని తిననివ్వు అంటాడు. అప్పుడు తులసి అక్కడికి రావడంతో తులసిని చూసి పరంధామయ్య అనసూయ ఇద్దరు షాక్ అవుతారు. ఏంటిది అని తులసి అనడంతో ఏంటి మేడం వీళ్ళు మీ తల్లిదండ్రుల ఇందాకే కదా మేడం మిమ్మల్ని పొగిడాను. సమాజంలో ఎంతోమందికి మిమ్మల్ని రోల్ మోడల్ అన్నాను. ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. పార్టీలు అవి ఇవి అని మీరు తినడం కాదు పెద్దవాళ్లను పట్టించుకోని వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలి అని అంటాడు. అప్పుడు అతని మాటలకు తులసి పరంధామయ్య అనసూయ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకుంటారు.
 

బాబు క్షమించండి మా తులసీది ఇందులో తప్పులేదు నేనే వద్దని మా ఆవిడ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ పరువు కూడా తీశాను అని అంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ వాళ్ళు అనసూయ వాళ్ళను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తులసి పరంధామయ్య వాళ్లు అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. తన కుటుంబ సభ్యులను ఒకరు అన్నమాట తలుచుకుని బాధపడుతూ ఉంటుంది తులసి. పార్టీలో జరిగిన అవమానం తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తులసి. మరుసటి రోజు ఉదయం తులసి ఆఫీస్ కి వెళ్లి సామ్రాట్ తో మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు తులసి ఎలా మాట్లాడాలో అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

 మధ్యకాలంలో నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను అనడంతో మీరు అలా మాట్లాడకండి తులసి గారు అని అంటాడు సామ్రాట్.అప్పుడు సామ్రాట్ తులసికి ధైర్యం చెబుతూ ఉంటాడు. కాని తులసి మాత్రం అలసిపోయాను సామ్రాట్ గారు ఇంకా పోరాడి ఓపిక నాకు లేదు అని అంటుంది. అప్పుడు పాయింట్ కి రండి అని సామ్రాట్ అనడంతో నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనడంతో సామ్రాట్ షాక్ అవుతాడు. కరెక్ట్ గానే విన్నారు నేను మా ఇంటికి వెళ్లి పోతాను అని అంటుంది తులసి.

click me!