Intinti Gruhalakshmi: నీ ప్రాజెక్ట్ మా బాస్ చూడాలన్న నందునే ఒకే చెయ్యాలి.. తులసికి షాకిచ్చిన లాస్య?

Published : Jul 23, 2022, 12:09 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 23 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.  

PREV
17
Intinti Gruhalakshmi: నీ ప్రాజెక్ట్ మా బాస్ చూడాలన్న నందునే ఒకే చెయ్యాలి.. తులసికి షాకిచ్చిన లాస్య?

 ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi) ఇంటికి బ్యాంకు మేనేజర్లు వస్తారు. ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. తులసికి నమస్తే పెట్టి మేము బ్యాంకు నుంచి వచ్చాము అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆ బ్యాంకు వాళ్లు మీరు మ్యూజిక్ స్కూల్ పెట్టడానికి డబ్బులు కావాలి కదా మేము ఇస్తాము అని అనటంతో వెంటనే తులసి(tulasi)బ్యాంకు వాళ్ళు ఈ మధ్య ఇంటికి వచ్చి మరి లోన్ ఇస్తున్నారా అనగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే బ్యాంకు వాళ్లు గవర్నమెంట్ ఆడవారి కోసం కొత్తగా స్కీములు తీసుకుని వచ్చింది. ఎక్కువగా కండిషన్స్ ఉండవు.
 

27

లోన్ ఈజీగా వస్తుంది అనటంతో తులసి కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దర్నీ బాగా గమనించిన తులసి వాళ్ళిద్దరూ సామ్రాట్(samrat) మనుషులు అని పసిగడుతుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరు పంపించారు అని నాకు తెలుసు అర్హత లేకుండా నేను ఏది ఆశించుకోను మిమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్లకి చెప్పండి అని అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ బ్యాంకు మేనేజర్ల ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే వాళ్ళ నుంచి ఫోన్ రాగానే పని అయిందా మేనేజర్ గారు అనడంతో వెంటనే తులసి(tulasi) మాట్లాడుతూ పని అవ్వలేదు సార్ అని చెప్పగా సామ్రాట్ ఆశ్చర్యపోతాడు.
 

37

ఆ తర్వాత తులసి,సామ్రాట్(samrat) కి తగిన విధంగా బుద్ధి చెప్పి ఇకపై ఇలాంటి ఆలోచనలు చేయకండి అని చెబుతుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో మాట్లాడుతూ ఈవిడెంటి బాబాయి ఇలా చేస్తుంది ఇలా క్యారెక్టర్ నేనెప్పుడూ చూడలేదు అని అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నవ్వుతూ ఉంటాడు. ఇంతలోనే హనీ(hani) అక్కడికి రావడంతో హనీ వైపు చూసి నా దిష్టి తగిలేలా ఉంది అని తన కూతుర్ని ముద్దాడుతూ ఉంటాడు సామ్రాట్.
 

47

అప్పుడు సామ్రాట్(samrat)వాళ్ళ బాబాయ్ ఈరోజు పండుగ ఉందా అని అడగగా వెంటనే హనీ ఈరోజు నేను తులసి ఆంటీ దగ్గరికి సంగీత నేర్చుకోవడానికి వెళుతున్నాను అని చెప్పి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ని పిలుచుకొని వెళ్తుంది హని. మరొకవైపు తులసి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హని(hani)వస్తుంది. అప్పుడు హనీ వాళ్ళ బాబాయ్ తో తులసి కాసేపు సామ్రాట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది.
 

57

 కానీ తెలిసి మాత్రం సామ్రాట్(samrat) వల్ల బాబాయ్ కీ కూడా ఫుల్ గా క్లాస్ పీకుతుంది. అప్పుడు హని నాకు సంగీతం నేర్పించండి ఆంటీ. మా నాన్న మీద కోపం నామీద చూపించకండి నన్ను మీ శిష్యురాలుగా చేర్పించుకోండి అని అడుగుతుంది. అప్పుడు హని బ్రతిమలాడగా తులసి అందుకు సరే అని అంటుంది. మరొకవైపు ప్రేమ్(pream), శృతి కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటాడు. శృతి కూడా ప్రేమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు అభి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తులసి,అభికి ఫోన్ చేస్తుంది.
 

67

అభి మాత్రం తులసి(tulasi)ని మరింత అపార్థం చేసుకుంటూ తులసి పై కోపంగా మాట్లాడుతాడు. అప్పుడు అంకిత, తులసి గురించి తప్పుగా అపార్థం చేసుకొని మాట్లాడుతాడు. కానీ అబి(abhi) మాత్రం తులసి ఎంత చెప్పినా వినిపించుకోకుండా తులసిని మరింత అపార్థం చేసుకుంటాడు. తులసి తల్లిగా ఎమోషనల్ అవుతూ మాట్లాడగా అవి మాత్రం వెటకారంగా మాట్లాడుతూ తులసిని మరింత బాధ పెడతాడు. అప్పుడు తులసి, అభి ని పండుగకు రమ్మని చెబుతుంది. ఇంతలోనే అభి దగ్గరికి గాయత్రి వస్తుంది.
 

77

అప్పుడు గాయత్రి(gayathtri),అభి ని బట్టలు సర్దుకుని వెళ్లిపోమని చెబుతుంది. అంకిత చాలా మొండిదీ సమయం సందర్భం చూసి ప్రేమగా నాతో చెప్పి ఇక్కడికి పిలుచుకొనిరా అని అభిని రెచ్చగొడుతుంది గాయత్రి. మరొకవైపు నందు,లాస్యల కోసం ఇంటర్వ్యూకు చాలామంది వచ్చేసరికి ఆనందపడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో అనుకోకుండా తులసి నందు వాళ్లు పని చేస్తున్న కంపెనీకి ఇన్వెస్ట్ కోసం వస్తుంది. అప్పుడు లాస్య(lasya)తన పొగరుని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నందు కూడా తులసి ముందు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు.

click me!

Recommended Stories