
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దేవయాని, జగతి మహేంద్రలతో, అయినా ఇందంతా మీ వల్లే వచ్చింది ఆ గురుదక్షిణ ఒప్పందం వల్ల రిషిని వసుని దూరం చేశారు. ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయంటే దానికి మీరే కారణం. అయినా మీరు తల్లిదండ్రులుగా రిషి కోసం ఏం చేశారు ఎప్పుడో రాత్రి ఇంటికి వస్తారు మీ పనులు మీరు చూసుకుంటారు ఎప్పుడైనా రిషి గురించి పట్టించుకున్నారా? ఒకవేళ ఈ మాటలన్నీ నేను రిషి ముందు అంటే ఈపాటికి మిమ్మల్ని అసహ్యించుకునేవాడు. మీరు ఇంట్లో ఉన్నా లేనట్టే.
మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటాది అనిపిస్తుంది నాకు అని చెప్పి కోపంతో అటువైపు నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. ఈ మాటలు విని జగతి, మహేంద్రలు ఎంతో బాధపడతారు. అప్పుడు మహేంద్ర జగతితో, జగతి మనమేదో ఒక పరిష్కారం ఆలోచించాలి ఈ మాటలు పడడం నావల్ల కాదు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి, వసుదారలు కార్లో వెళ్తూ ఎందుకో నీతో మాట్లాడాలి అనిపించింది వసుధారా అని రిషి అంటాడు. దానికి వసు, అవును సార్ నాకు కూడా మీతోనే ఉండాలనిపిస్తుంది ఈరోజు అని అంటుంది.
అప్పుడు రిషి, వసుధార నామీద నీకు ఎందుకు అంత నమ్మకం. మనం ఈ సమయంలో కార్లో వెళ్తున్నారు కదా ఎవరైనా ఆపి నీకు నాకు సంబంధం ఏంటి అని అడిగితే ఏం చెప్తావు అని అనగా, మిమ్మల్ని జవాబు ఇవ్వమంటాను సార్ అంటుంది. ఎవరో కాదు నేనే అడుగుతున్నాను నీకు నాకు సంబంధం ఏంటి అని అడుగుతాడు రిషి. అప్పుడు వసుధార, మీరు నేను, నేను మీరు సర్. మీరు నా సగ భాగం అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటూ జగతి, మహీంద్ర లు వాళ్ళు గదిలో బాధపడుతూ ఉంటారు. మహేంద్ర రిషికి ఫోన్ చేయగా రిషి ఫోన్ స్విచాఫ్ లో ఉంటుంది.
దానికి మహేంద్ర, చూసావా జగతి రిషి నా ఫోన్ ఎత్తడం లేదు నేను ఫోన్ చేస్తే మాట్లాడకపోతే బాగోదు అని ఫోన్ స్విచాఫ్ లో పెట్టేసాడు. ఫోన్ ఉన్నా సరే మాట్లాడడానికి రిషి మనసు ఉండాలి కదా. నిజంగానే దేవయాని వదిన అన్నట్టుగా మనమే రిషికి శత్రువులము అయిపోతున్నామా. అప్పుడు దేవినేని మాటలు గుర్తొచ్చి, దేవయాని వదిన ఒక ప్రశ్నని మన గుండెల్లో బాణంగా విసిరారు దాన్ని ఎలాగైనా పరిష్కరించాలి నేను ఒకటి చెప్తాను అది చేయి జగతి అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి, వసుధారలు రోడ్డు మీద గట్టుమీద కూర్చొని ఒకరి భుజం మీద ఒకరు జారబడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు రిషి, ఏమో వసుధార నీ దగ్గర ఉంటే మనసులో దిగులంతా పోయి హాయిగా ఉంటుంది అని అంటాడు. నమ్మకం వసు,ప్రేమ ఉంటే అంతే సార్ అయినా మనిద్దరం ఇలా చాలా బాగుంది కదా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ లో పెట్టి కార్లో ఉంచాను ఏ గోల ఉండదు అని అనగా రిషి ఆశ్చర్యపోయి వెనక్కి తిరుగుతాడు. తిరిగేసరికి వసుధార రిషి వొడిలో పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టి కొంచెం సేపు చూసుకుంటారు. ఆ తర్వాత సీన్లో జగతి, మహేంద్రలు అన్ని సర్దుకుంటూ ఉంటారు.
మనం ఇంటిని వొదిలి వెళ్లిపోతున్నామా అని జగతి అనగా, అవును జగతి ఇది ఒకటే పరిష్కారం ఉన్నది. వదిన గారు అన్నారు కదా ఇల్లు వదిలి వెళ్ళిపోమని ఇంక ఈ బంధాలకి మనకి ఎటువంటి సంబంధము ఉండదు అని పెట్ట సర్దుకొని బయటికి వెళ్తున్నప్పుడు మహేంద్ర,రిషిది, తనది ఫోటో చూసి, రిషి నిజంగా నేను మారిపోతున్నానా ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను మారిపోతున్నాను పారిపోతున్నాను అని అనుకుంటూ బాధతో జగతిని తీసుకొని ఇల్లు వదిలి కారులో కూర్చుంటారు. దీన్ని దేవయాని చూస్తూ ఆనందపడుతుంది.
ఆ తర్వాత సీన్లో రిషి వసుదారలు మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితం చాలా చిత్రంగా ఉంటుంది కదా వసుధార, అప్పుడే నవ్వుతాము అప్పుడే ఏడుస్తాము అని అనగా వసు రిషి ని చూస్తూ ఉంటుంది. ఎందుకు వసుధార నన్నే చూస్తున్నావు ఏం మాట్లాడటం లేదు అని అనగా, మీరు మాట్లాడండి సార్ మిమ్మల్ని మీ నవ్వును చూస్తూ ఉంటాను అని వసు అంటుంది. దానికి రిషి, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నవ్వులన్నీ వచ్చాయి వసుధార థాంక్స్ అని అనగా దీనికి కూడా ఒక రకంగా జగతి మేడమే కారణం సర్ అని వసు అంటుంది.
అప్పుడు రిషి కొంచెం మాట మారుస్తూ అయినా మనం చాలా రోజుల తర్వాత పక్క వాళ్ళ గురించి కాకుండా మన గురించి మాట్లాడుకున్నాం వసుధార ఇకపై ఇలాంటి రోజులే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వసు, నాకు సందేహం ఉంది అడగనా అని అనగా, మన గురించి అయితే మాత్రమే అడుగు వసుధార ఇప్పుడు కొత్త రకం సమస్యలు ఏమి సృష్టించొద్దు అని అనగా మన గురించే సార్ మీ ఫోన్లో నన్ను పొగరు అని ఎందుకు సేవ్ చేసుకున్నారు. నాకు మంచి పేరు ఉంది కదా అది ఎందుకు పెట్టుకోలేదు అని అనగా, నీకు మంచి పేరు ఉంది వసుధార కానీ మనం చిన్న పిల్లల్ని బుజ్జి,కన్నా అని ఎందుకు పిలుస్తాము వాళ్ళ మీద ప్రేమతోనే కదా.
అందరి ఫోన్ లోనీ నీ పేరు వసుధార అనే ఉంటుంది కానీ నేను నీకు స్పెషల్ కదా అందుకే ఇలా సేవ్ చేసుకున్నాను. పొగరు అంటే అదేం తిట్టో లేకపోతే బూతో కాదు అది కూడా ఒక మంచి పదమే అని రిషి అంటాడు. అప్పుడే రిషి, అయినా వసుధార నా జీవితంలో నాకు ఆనందం తెప్పించే వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకళ్ళు నువ్వు ఇంకొకలు డాడ్. డాడ్ అంటే నాకు చాలా ప్రాణం. డాడ్ లేకుండా నేను ఉండలేను ముందుగా నేను లేకుండా డాడీ ఉండలేరు మా బంధం జీవితాంతం ఇలాగే ఉంటుంది అని అంటూ, ఏవేవో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాను కదా అని అంటాడు.
అప్పుడు వసు, పర్లేదు సార్ అని రిషి బుజం మీద తను తలపెట్టి మీరు ఏం మాట్లాడినా నాకు నచ్చుతుంది అని అంటుంది. అప్పుడు రిషి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకున్నాం కదా అని అనగా అవును సార్ మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అని వసు అంటుంది. మరోవైపు జగతి,మహీంద్ర లు కారులో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తూ చాలా భారంగా ఉన్నది జగతి గుండెల్లో ఏదో తెలియని బరువుగా ఉన్నది అని అంటాడు. మరోవైపు రిషి వసుధారతో, గుండెల్లో ఏదో తెలియని ఆనందం ఉన్నది వసుధార మనసు ప్రశాంతంగా ఉన్నది అని అంటాడు.
మరోవైపు మహేంద్ర కారులో, ఇది కల అయితే బాగున్న కదా జగతి రేపు ఉదయం లెగిసిన వెంటనే రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అని అనగా బాధపడొద్దు మహేంద్ర ఇది మనం రిషికి ఇస్తున్న కానుక అనుకుందాం రిషి ఆనంద పడుతాడు కదా అని అంటుంది. మరోవైపు రిషి వసుతో, వసుధార ఆ దేవుడు అందించిన కానుక ఏమో నువ్వు అని అనిపిస్తుంది అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!