Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. లక్కు కలిసొస్తే స్టార్స్ మీరే

Published : Jul 08, 2025, 01:59 PM IST

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లో పాల్గొనే అవకాశం కామన్‌ పబ్లిక్‌ కి కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఈ రోజే చివరి రోజు అని బిగ్‌ బాస్‌ టీమ్‌ వెల్లడించింది. 

PREV
15
`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లో ఎంట్రీకి లాస్ట్ ఛాన్స్

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌ హడావుడి ప్రారంభమైంది. ఓ వైపు కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. మరో వైపు కామన్‌ ఆడియెన్స్ కి బిగ్‌ బాస్‌ నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

 బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. గతంలోనూ ఇలాంటి ఆఫర్స్ ఇచ్చారు. అది షోకి బాగా కలిసి వచ్చింది. చాలా మంది ఎవరికీ తెలియని వ్యక్తులు ఈ షోకి వచ్చి స్టార్స్ అయ్యారు. 

పల్లవి ప్రశాంత్‌, ఆదిరెడ్డి, నూతన్‌ నాయుడు, సంజనా, గణేష్‌ వంటి వారి ఈ కేటగిరిలోనే వచ్చిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్‌ ఏకంగా బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో టైటిల్‌ విన్నర్‌ అయ్యాడు.

25
బిగ్‌ బాస్‌ తెలుగు 9కి అప్లై చేసుకోవడానికి ఇదే చివరి రోజు

ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లోనూ మరోసారి ఆ బంపర్‌ ఆఫర్‌ని ఇస్తున్నారు. గత వారమే ఈ ఆఫర్‌ని ప్రకటించగా, దీనికి అప్లై చేసుకోవడానికి ఇదే చివరి రోజు(మంగళవారం) కావడం గమనార్హం. 

జులై 8న చివరి రోజుగా బిగ్‌ బాస్‌ టీమ్‌ వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రకటించింది. చివరి అవకాశం, సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. మీ డ్రీమ్స్ ని నెరవేర్చుకునేందుకు ఇది చివరి అవకాశంగా వెల్లడించింది. 

మరి ఎంత మంది ఈ ఛాన్స్ ని ఉపయోగించుకుంటారు? వీరిలో ఎవరు ఎంపిక అవుతారో చూడాలి. ఈ సారి ఇద్దరు ముగ్గురికి కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

35
ట్విస్ట్ లు, టర్న్ లతో `బిగ్‌ బాస్‌ తెలుగు 9`

బిగ్‌ బాస్‌ తెలుగు 9 సీజన్‌ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల చేశారు. ఈ సారి లోగో కాస్త కొత్తగా ఉంది. ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు ఈ సారి హౌజ్‌లో రణరంగమే అంటూ హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 

అంతేకాదు ఈ సీజన్‌లో ట్విస్ట్ లు, టర్న్ లు గట్టిగానే ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ సారి ఎక్కువగా వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

45
బిగ్‌ బాస్‌ తెలుగు 9కి కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న పేర్లు

ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లలో జ్యోతి రాయ్‌, తేజస్విని, రీతూ చౌదరీ, కావ్య, కల్పిక గణేష్‌, దీపికా, దేబ్‌ జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్యతోపాటు సుమంత్‌ అశ్విన్‌, రాజ్‌ తరుణ్‌, సాయి కిరణ్‌, ఛత్రపతి శేఖర్‌, శివ కుమార్‌, 

ఇమ్మాన్యుయెల్‌, మై విలేజ్‌ షో అనిల్‌, సీనియర్‌ నటుడు ప్రదీప్‌, ఒకప్పటి హీరో రోహిత్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఎంపికవుతారు. ఎవరు హౌజ్‌లోకి వస్తారో చూడాలి.

55
నవరత్నాలు హైలైట్‌గా `బిగ్‌ బాస్‌ తెలుగు 9

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌లో నవరత్నాలు ఉంటారట. తొమ్మిది జంటలను నవరత్నాలుగా పరిగణిస్తారని, వీరిలో తొమ్మిది మంది బాయ్స్‌, మరో తొమ్మిది మంది గర్ల్స్ ఉంటారని, 

వీరినే జంటలుగా చేసి హౌజ్‌లోకి పంపిస్తారని, వీరి చేత స్పెషల్‌ గేమ్స్, టాస్క్ లు ఆడించబోతున్నారని సమాచారం. మొదటి స్టెప్‌లో ఈ 18 మంది హౌజ్‌లోకి వెళ్తారని, 

మిగిలిన వారిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ షో సెప్టెంబర్‌ 7న స్టార్‌ మాలో, హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories