అయితే సూర్య, ఓం ప్రకాష్ కర్ణ చిత్రం కంగువా డిజాస్టర్ కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. కంగువాకి భారీ నష్టాలు ఎదురయ్యాయి. దీనితో కర్ణ చిత్రానికి 500 కోట్లు పెట్టడం సాధ్యం కాదు అని నిర్మాతలు వెనుకడుగు వేశారు. దీనితో ఈ చిత్రం రద్దయినట్లు బాలీవుడ్ లో టాక్. గతంలో కర్ణుడి పాత్ర అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. దానవీర శూర కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన స్వీయ దర్శకత్వంలో దానవీర శూర కర్ణ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు మహాభారతం నేపథ్యంలో అలాంటి చిత్రం తెరకెక్కించాలి అంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.