Kushi Title: రివర్స్ అటాక్.... రీమేక్ టైటిల్ పై రాద్ధాంతం ఎంటీ? ఆ మాటకొస్తే టైటిల్ పవన్ ది కాదు!

Published : May 17, 2022, 03:18 PM IST

కొన్ని కొన్ని వివాదాలు విడ్డూరంగా ఉంటాయి. ఖుషి మూవీ టైటిల్ విషయంలో ఈ తరహా గొడవే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ టైటిల్ తో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల(Samantha)ను తిట్టిపోయడం హాట్ టాపిక్ గా మారింది. 

PREV
16
Kushi Title: రివర్స్ అటాక్.... రీమేక్ టైటిల్ పై రాద్ధాంతం ఎంటీ? ఆ మాటకొస్తే టైటిల్ పవన్ ది కాదు!
Kushi Title controversy

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషి. 2001లో దర్శకుడు ఎస్ జే సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ కి జంటగా భూమిక నటించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఖుషి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. యూత్ ని ఊపేసిన ఈ చిత్రం పవన్ ఇమేజ్ డబుల్ చేసింది. కమర్షియల్ గా కూడా కాసులు కురిపించింది. ఈ ఖుషి విడుదలై రెండు దశాబ్దాలు దాటిపోయింది. తాజాగా ఈ టైటిల్ తో విజయ్ దేవరకొండ-సమంత ఓ మూవీ ప్రకటించారు. 
 

26
Kushi Title controversy


నిన్ను కోరి, మజిలి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో చేస్తున్న మూవీకి ఖుషి టైటిల్ ప్రకటించారు. నిన్న హీరో హీరోయిన్ తో కూడిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ చిత్ర టైటిల్ ప్రకటన నాటి నుండి పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం మొదలుపెట్టారు. 
 

36
Kushi Title controversy


తమ హీరో కెరీర్ లో కల్ట్ క్లాసిక్ ఖుషి (Kushi Title)మూవీ. అలాంటి చిత్ర టైటిల్ మీరు వాడడం మాకు ఇష్టం లేదంటున్నారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆదుకోవడమే అంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదూ వేరే టైటిల్ వెతుక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

46
Kushi Title controversy

ఈ పరిణామాలు గమనిస్తున్న నెటిజెన్స్ పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహానికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వాళ్ళ కామెంట్స్ కి కౌంటర్లు విసురుతున్నారు. అసలు ఖుషి ఓ రీమేక్ చిత్రం. విజయ్-జ్యోతిక 2000లో నటించిన అదే టైటిల్ తో తెరకెక్కిన తమిళ చిత్ర తెలుగు రీమేక్. ఆ మాటకొస్తే ఖుషి టైటిల్ విజయ్ కి చెందింది. దాన్ని పట్టుకొని మీ గొడవేంటి అంటున్నారు . 
 

56
Kushi Title controversy

చిత్ర పరిశ్రమలో ఓకి టైటిల్ తో కాలానుగుణంగా చిత్రాలు రావడం సర్వ సాధారణం. ఆరాధన టైటిల్ తో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి చిత్రాలు చేశారు. ఓ చిత్ర టైటిల్ కాపీ రైట్స్ ముగిస్తే ఎవరైనా ఆ టైటిల్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే సదరు నిర్మాతల పర్మిషన్ తో టైటిల్ వాడుకోవచ్చు. 
 

66
Kushi Title controversy

ఇక దేవదాసు, ప్రేమాభిషేకం వంటి ఆల్ టైం క్లాసిక్స్ మూవీ టైటిల్స్ తో కూడా సినిమాలు వచ్చాయి. తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్లు అన్నట్లు పవన్ అభిమానులు వింత వాదన చేస్తున్నారు. అదే టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కడం వలన పాత చిత్రానికి వచ్చిన నష్టమేమి ఉండదు. కొత్త మూవీ విజయం సాధించినా, సాధించకున్నా... ఓల్డ్ మూవీ గౌరవం అలానే ఉంటుంది.. కాబట్టి ఈ అనవసర వివాదానికి పవన్ ఫ్యాన్స్ అడ్డుకట్ట వేస్తే బెటర్ అంటున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories