కుర్చీ తాత(Sheikh Ahmed Shasha).. `ఆ కుర్చీని మడత పెట్టి` అనే డైలాగ్‌తో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియా పుణ్యామా అని సెలబ్రిటీ అయిపోయాడు కుర్చీ తాత. ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓవర్ నైట్‌లో పాపులర్ అయిపోయాడు. ఆ పాపులారిటీని మరింత పెంచారు మహేష్ బాబు, త్రివిక్రమ్.
`గుంటూరు కారం` సినిమాలో ఏకంగా `ఆ కుర్చీని మడత పెట్టి` అంటూ పాటనే పెట్టారు. మహేష్ బాబు, శ్రీలీల మీద వచ్చే ఈ పాట ఉర్రూతలూగించింది. అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. ఈ దెబ్బతో కుర్చీతాత కూడా సెలబ్రిటీ అయిపోయాడు.