`కుబేర` గ్లింప్స్ రివ్యూః నాగార్జున, ధనుష్‌, రష్మిక ఆరాటం దేనికోసం? శేఖర్‌ కమ్ముల మామూలోడు కాదుగా

First Published | Nov 15, 2024, 8:42 PM IST

ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన `కుబేర` మూవీ గ్లింప్స్ వచ్చింది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల దీని ద్వారా ఏం చెప్పాడంటే?
 

నాగార్జున ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాడు. ఆయన హీరోగానే కాదు, మంచి కథలు వస్తే, బలమైన పాత్రలు వస్తే ఇతర హీరోల సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా ధనుష్‌తో కలిసి `కుబేర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తుంది. శేఖర్‌ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

తాజాగా నేడు శుక్రవారం `కుబేర` గ్లింప్స్ విడుదలైంది. చాలా ఇంటెన్సిటీతో టీజర్‌ సాగింది. ఒక్క డైలాగ్‌ కూడా లేదు. కేవలం ఎమోషన్స్ మీదనే గ్లింప్స్ ని నడిపించాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. తన మార్క్ ఎమోషన్స్ ని ఇందులో ఆవిష్కరించాడు. కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోనే, పాత్రల సంఘర్షణతో కథకి సంబంధించిన హింట్‌ ఇచ్చాడు. అయితే కథ మొత్తం సస్పెన్స్ లో పెట్టి క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. సినిమాపై ఉత్సుకతని పెంచేశారు. 
 

Latest Videos


గ్లింప్స్ లో ధనుష్  స్లమ్స్ లో హంబుల్ లైఫ్ ని  లీడ్‌ చేస్తున్న వ్యక్తిగా కనిపించాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. మరోవైపు నాగార్జున తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్న  సక్సెస్ ఫుల్ మ్యాన్ గా కనిపించారు. అదే సమయంలో ఆయనలోనూ తెలియని ఆందోళన, టెన్షన్‌, కోపం కనిపిస్తున్నాయి.

జిమ్ సర్భ్  బిలియనీర్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడు,  రష్మిక మందన్న మధ్యతరగతి అమ్మాయిగా అసంతృప్తితో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె ముఖంలో ఏదో ఆరాటం కనిపిస్తుంది. ఇలా మెయిన్‌గా ప్రతి పాత్రని వారి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ తో  పోరాడుతున్నట్లు ప్రజెంట్ చేశారు. 
 

అదే సమయంలో ఆర్థిక అసమానతలను అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నలుగురు, నాలుగు తరగతులుగా డివైడ్‌ చేసి, వారి స్థాయిలో వారు పడే బాధల, సంఘర్షణని ఆయా పాత్రల ద్వారా పరిచయం చేశారు. మరి ఈ నాలుగు పాత్రలకు ఉన్న లింక్‌ ఏంటనేది మాత్రం సినిమాలో చూస్తే తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల గ్లింప్స్ కట్‌ చేసిన విధానం ఎక్కువ ప్రశ్నలను రేకెత్తిస్తుంది. కథను ఎక్కువగా రివిల్ చేయకుండా పాత్ర పరిచయాలు, వారి ఎమోషనల్ ఆర్క్‌లపై దృష్టి సారిస్తుంది. ధనుష్, నాగార్జున, జిమ్ సర్భ్, రష్మిక మందన్న తమదైన ఎనర్జీని తెరపైకి తెస్తున్నారు.
 

విజువల్ గా `కుబేర` కట్టిపడేసింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్  బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఇంటెన్స్ అండ్ ఎనర్జిటిక్ లేయర్ ని యాడ్ చేసింది. అతని మ్యూజిక్ ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ వీడియో సినిమా యొక్క గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌ని తెలియజేస్తుంది. మొత్తానికి, కుబేరు ఫస్ట్ గ్లింప్స్ ఎమోషనల్ డెప్త్, విజువల్  గ్రాండియర్ తో అదరగొట్టింది.

భారీ కాస్టింగ్‌తో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న `కుబేర`పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలని ఫస్ట్ గ్లింప్స్ మరింతగా పెంచింది. ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కూర్‌ రామ్ మోహన్ రావు  నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ పై క్లారిటీ రావాల్సి ఉంది.  

Read more:అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు కాదు, ఏఎన్నార్‌ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? నాగార్జున హీరో ఎంట్రీ వెనుక అంత బాధ ఉందా

also read: అమ్మకి భయపడి ముంబయి ట్రైన్‌ ఎక్కి పారిపోయిన రవితేజ, మంటలు చెలరేగడంతో మర్చిపోలేని ఘటన
 

click me!