Prabhas Adipurush:ప్రభాస్ 'ఆదిపురుష్'పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అజెండాలో భాగమే, మొత్తం 16 సినిమాలు

Published : Apr 25, 2022, 03:46 PM IST

దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా.. ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణంలోని కీలక అంశాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

PREV
17
Prabhas Adipurush:ప్రభాస్ 'ఆదిపురుష్'పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అజెండాలో భాగమే, మొత్తం 16 సినిమాలు
Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఖ్యాతి దక్కించుకున్నాడు. బాహుబలి తర్వాత నుంచి అభిమానులంతా ప్రభాస్ ని హిందూ పౌరాణిక పాత్రల్లో వుహించుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే పౌరాణిక పాత్రలకు తగ్గ రూపం, ఆహార్యం ప్రభాస్ సొంతం. దీనితో బాలీవుడ్ నుంచి ప్రభాస్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతున్నారు. 

27
adipurush

అంతా ఊహించినట్లుగానే ప్రభాస్ కి పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం దక్కింది. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా.. ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణంలోని కీలక అంశాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం 2023 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. 

 

37
KTR

అయితే తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రానికి పొలిటికల్ రంగు పులుముకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణాలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎక్కువగా తెరాస, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో భాగంగా ఆదిపురుష్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

47
KTR

బీజేపీ అజెండాలో భాగంగానే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతోందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఐడియాలజీని దేశం మొత్తం స్ప్రెడ్ చేసేందుకు దాదాపు 16 సినిమాలు ప్లాన్ చేసారని కేటీఆర్ అన్నారు. వాటిలో ఇప్పటివరకు ఉరి ది సర్జికల్ స్ట్రైక్, కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలు ఆల్రెడీ విడుదల అయ్యాయి. 

 

57
The Kashmir Files

ఈ చిత్రాల్లో అండర్ లైన్ గా దేశభక్తి, బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ చిత్రాలకు ఆయా రాష్ట్రాల్లో బిజెపి ప్లాన్ ప్రకారం టాక్స్ ని తగ్గిస్తారు. అలాగే ఆడియన్స్ పెరిగేలా ప్రచారం నిర్వహిస్తారు. తద్వారా పరోక్షంగా బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తారు. ఎన్నికల ముందు ఈ చిత్రాలని విడుదల చేయడం  బిజెపి ఎలక్షన్ ప్లానింగ్, పొలిటికల్ అజెండాలో భాగమే అని కేటీఆర్ అన్నారు. 

 

67
Prabhas

ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం ద్వారా మరోసారి శ్రీరాముడి సెంటిమెంట్ పైకి తీసుకుని వస్తారు. రామరాజ్యం అంటే.. బిజెపి ప్రభుత్వం అని ప్రజలు భావించేలా చేయడమే ఈ చిత్రాల లక్ష్యం. దేశ భక్తి అంటే బీజేపీ నాయకులే అనే భావన కలిగేలా ఈ 16 చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. 

 

77
manikarnika

ఈ ప్లాన్ ప్రభాస్ కి కూడా తెలిసే ఉండొచ్చు అని కేటీఆర్ అన్నారు.తాష్కెంట్ ఫైల్స్, పాడ్ మ్యాన్, గోల్డ్, సత్యమేవ జయతే, భాగి 2, మేరె ప్యార్ ప్రధాన్ మంత్రి, మణికర్ణిక లాంటి చిత్రాలు బిజెపి అజెండాలో భాగంగా రూపొందినవే అని ఆరోపించారు. మరి ఈ ఆరోపణలపై ప్రభాస్, ఆదిపురుష్ టీం స్పందిస్తారో లేదో చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories