నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి ఎపిసోడ్ లకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్స్ హాజరు కావడంతో అన్ స్టాపబుల్ షో క్రేజీ షో గా దూసుకుపోతోంది.