రంగుల ప్రపంచంలో మెప్పించుకోవాలంటే అందం, అభినయంతో పాటు కొంత దూసుకుపోయే గుణం ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక (Rashmika Mandanna)లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. పాతికేళ్లు కూడా నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది. తన నటనా శైలితో ప్రేక్షకులను అలరిస్తోంది.