Kriti Sanon: చెల్లి పెళ్లి వేడుకలో కృతి సనన్ డ్యాన్స్ చూశారా, దుమ్ములేచిపోయేలా చిందులు, వైరల్

Published : Jan 10, 2026, 04:58 PM IST

కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో మొదలయ్యాయి. ఇటీవల జరిగిన ఆమె సంగీత్ సెర్మనీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నుపుర్ సనన్ సంగీత్ ఫోటోలు, వీడియోలు చూడండి...

PREV
15
కృతి చెల్లెలు నుపుర్ పెళ్లి సంబరాలు

కృతి సనన్ చెల్లెలు నుపుర్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృతి ఈ ప్రత్యేక క్షణాలను సినిమా స్టైల్‌లో సెలబ్రేట్ చేస్తోంది. సంగీత్ సెర్మనీలో ఇరు కుటుంబాలు ఫుల్లుగా ఎంజాయ్ చేశాయి.

25
చెల్లి సంగీత్‌లో పింక్ లెహంగాలో కృతి సనన్ డాన్స్

నుపుర్ సనన్ సంగీత్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. పింక్ లెహంగా, కుర్తీ స్టైల్ బ్లౌజ్‌తో ఆకట్టుకుంది. కృతి అందంతో పాటు ఆమె డాన్స్ కూడా వేడుకకు కొత్త కళను తెచ్చింది.

35
భోజ్‌పురి పాట 'లాలిపాప్ లాగేలు'కు కృతి సనన్ అదిరిపోయే డాన్స్

నుపుర్ సంగీత్‌లో కృతి సనన్ 'లాలిపాప్ లాగేలు' అనే భోజ్‌పురి పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పాట పెళ్లిళ్లలో కూడా ప్లే అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

45
నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్? అని కృతిని అడుగుతున్న జనం

నుపుర్ సనన్ సంగీత్ వైరల్ వీడియోలు చూసి నెటిజన్లు కృతి సనన్‌ను ఆటపట్టిస్తున్నారు. "చిన్న చెల్లి పెళ్లి కూడా అయిపోయింది, నువ్వెప్పుడు చేసుకుంటావ్" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "కృతి చాలా సంతోషంగా ఉంది, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు" అని మరొకరు రాశారు.

55
కృతి చెల్లెలు నుపుర్ పెళ్లి ఎప్పుడు, ఎవరితో?

కృతి సోదరి నుపుర్ సనన్ పెళ్లి జనవరి 11, 2026న. వరుడు స్టెబిన్ బెన్, ఒక ఫేమస్ మ్యూజిషియన్, సింగర్. 'రులా కే గయా ఇష్క్', 'బారిష్' వంటి పాటలతో ఇతను పాపులర్ అయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories