జీన్స్ వేర్ లో కృతి సనన్ కిక్కిచ్చే ఫోజులు.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో అందాల ప్రదర్శన

First Published | Oct 9, 2023, 2:33 PM IST

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మతులు పోగొట్టేలా ఫోజులిచ్చింది. 
 

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  రీసెంట్ గా ‘ఆదిపురుష్’తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అంతకు ముందుకు ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది.
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో నటించి ఆకట్టుకుంది. ఆ సినిమా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ‘ఆదిపురుష్’ తర్వాత ‘గణపథ్’ సినిమాతో రాబోతోంది. 
 


బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)కు జోడీగా కృతి సనన్ Ganapath చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కృతిసనన్ కూడా తన వంతుగా సినిమాను ప్రచారం చేస్తోంది. ఇందుకు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ.. గ్లామర్ విందుతో తనవైపు తిప్పుకుంటోంది. 
 

రకరకాల అవుట్ ఫిట్లతో, లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్ వేర్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ పొడగరి సొగసుకు సరిపడా దుస్తులు ధరిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. నయా లుక్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా అభిమానులతో మరిన్ని ఫొటోలను  పంచుకుంది. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో కృతిసనన్ బ్లూ జీన్స్ వేర్ లో దర్శనమిచ్చింది. డిఫరెంట్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. మరోవైపు షోల్డర్ అందాలతో మైమరిపించింది. మైండ్ బ్లోయింగ్ గా స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. గణపథ్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. 
 

Latest Videos

click me!