బ్లూ శారీలో కత్తిలాగా ఉన్న యాంకర్ సుమ.. రోజు రోజుకి త్రిషలా మారుతుందంటూ సెటైర్లు..

First Published | Oct 9, 2023, 1:25 PM IST

తెలుగు యాంకర్లలో అత్యంత క్రేజ్‌, రేంజ్‌ ఉన్న యాంకర్‌ సుమ. ఆమె అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తుంది. అయితే ఇప్పుడు కుర్ర యాంకర్లకి ఒక్క విషయంలో గట్టి పోటీ ఇస్తుంది. 
 

యాంకర్‌ సుమ టీవీ షోస్‌తోపాటు సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, స్పెషల్‌ షోస్‌, ఇంటర్వ్యూలు ఇలా అన్నింటిని ఓ రౌండ్‌ వేసుకుంటూ సందడి చేస్తుంటుంది. ఫంక్షన్‌ ఏదైనా, షో ఏదైనా ఆమె ఉందంటే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేలా రాణిస్తుంది. 

అయితే ఇప్పుడు కుర్ర యాంకర్‌ని ఫాలో అవుతుంది. ఇంకా చెప్పాలంటే వారిని మించి పోతుంది. కుర్ర భామలకు పోటీగా తాను కూడా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. రోజు రోజుకి మరింత యంగ్‌గా మారుతూ ఆద్యంతం కట్టిపడేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 


తాజాగా బ్లూ శారీలో మెరిసింది యాంకర్‌ సుమ. ఇందులో స్లిమ్‌ లుక్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. అయితే ఇందులో సుమ మాత్రం సూపర్‌ హాట్‌గా కనిపిస్తుందట. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 

అంతేకాదు హీరోయిన్‌తో పోల్చుతున్నారు. చూడ్డానికి త్రిషలాగే ఉన్నావని, రోజు రోజుకి త్రిషలా తయారవుతున్నావని, అందం పెరిగిపోతుందని అంటున్నారు. ఎప్పటిలాగే అన్నం తింటున్నావా? అందం తింటున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరోవైపు ఇప్పట్లో మీరు బామ్మ కారు అని, మీ వయసు పెరగడం లేదు, రోజు రోజుకి తగ్గిపోతుందని, అంతేకాదు చాలా అందంగా తయారవుతున్నావని అంటున్నారు. టాలెంట్‌, అందం కలగలిన యాంకర్‌ సుమ అంటూ ఆమెని ప్రశంసిస్తున్నారు. 
 

anchor Suma

యాంకర్‌ సుమ.. గ్లామర్‌ విషయంలో తన తోటి యాంకర్లకి పోటీ ఇస్తుంది. అనసూయ, రష్మి గౌతమ్‌, శ్రీముఖి వంటి యాంకర్లు నిత్యం ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటారు. వారిలాగే సుమ కూడా ఇలా ఫోటో షూట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

యాంకర్‌ సుమ టీవీ షోస్‌ తగ్గించింది. ఒకప్పుడు అందరికంటే బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర యాంకర్లు రావడంతో సుమ జోరు తగ్గింది. కొన్ని మాత్రమే చాలా సెలక్టీవ్‌గా చేస్తుంది. `సుమ అడ్డా` అందులో ఒకటి. 
 

Anchor Suma Kanakala

మరోవైపు సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలు చేస్తుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లతో బిజీగా ఉంటుంది. అలాగే సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టుకుని ఫన్నీ వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకుంటుంది. మొత్తంగా అన్ని రకాలుగా ఆమె తన సందడి కొనసాగిస్తుంది. 

Latest Videos

click me!