తనకు జరిగిన అన్యాయం బయటపెట్టిన కృతి సనన్.. హీరోయిన్‌ గా ఎంపిక చేసి తర్వాత స్టార్ కిడ్‌ని తీసుకున్నారంటూ ఆవేదన

Aithagoni Raju | Published : Jul 27, 2023 5:23 PM
Google News Follow Us

కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది కృతి సనన్‌. తనని ఎంపిక చేసి మరో స్టార్‌ కిడ్‌ని తీసుకున్నారంటూ ఆవేదన చెందిందీ పొడుగుకాళ్ల సుందరి. 
 

16
తనకు జరిగిన అన్యాయం బయటపెట్టిన కృతి సనన్.. హీరోయిన్‌ గా ఎంపిక చేసి తర్వాత స్టార్ కిడ్‌ని తీసుకున్నారంటూ ఆవేదన

`ఆదిపురుష్‌` చిత్రంతో ఆకట్టుకుంది కృతిసనన్‌. ఇందులో సీతగా నటించి మెప్పించింది. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన కృతిసనన్‌.. మోడల్‌గా పేరుతెచ్చుకుంది. ఈ క్రమంలో తొలి సినిమానే ఏకంగా సూపర్ స్టార్‌ మహేష్‌తో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. `వన్‌ నేనొక్కడినే` చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. 
 

26

ఆ తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ పాపులర్‌ అయ్యింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోలతో జోడీ కడుతూ రాణిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కృతిసనన్‌ గతాన్ని గుర్తు చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంది. నెపోటిజంపై ఆమె రియాక్ట్ అయ్యింది. నేడు 33వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది కృతి. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

36

కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మొదట తనని ఎంపిక చేసి, తర్వాత తన స్థానంలో స్టార్‌ కిడ్స్ ని ఎంపిక చేశారని తెలిపింది కృతి సనన్‌. తన కెరీర్‌లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చాలానే వచ్చాయి. ఆ విషయంలో తాను హ్యాపీగానే ఉన్నానని తెలిపింది. అయితే అవకాశాల కోసం దర్శకులను సంప్రదించడం తనకిష్టం ఉండదని, మనకు వచ్చిన అవకాశాల్లో వందశాతం కష్టపడి నటిస్తే కొంత కాలం తర్వాత మన పనే ఆఫర్లని తీసుకొస్తుందని వెల్లడించింది. అయితే దానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. 
 

Related Articles

46

ఈ సందర్భంగా తనకు మొదట్లో వచ్చి  జారిపోయిన అవకాశాల గురించి ఓపెన్‌ అయ్యింది కృతి. వచ్చిన అవకాశాలు పోయినప్పుడు చాలా బాధపడినట్టు తెలిపింది. `కొన్ని సినిమాల్లో మొదట హీరోయిన్‌గా నన్ను ఎంపిక చేశారు. కానీ అనూహ్యంగా తర్వాత నా స్థానంలో స్టార్‌ కిడ్స్ ని తీసుకున్నారు. దీని వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ పాత్రలను నాకంటే వాళ్లు బాగా చేయగలరని ఆయా డైరెక్టర్స్ నమ్మి ఉండొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలుంటాయి. ఏది జరిగినా దాని వెనుక ఓ కారణం ఉంటుందని నమ్ముతాను` అని పేర్కొంది కృతి సనన్‌. 

56

`ఆదిపురుష్‌`తో పరాజయాన్ని చవిచూసింది కృతి సనన్‌. చాలా రోజుల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుతం కృతి.. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు `బ్లూ బటర్‌ ఫ్లై` అనే ప్రొడక్షన్‌ హౌజ్‌ని ప్రారంభించింది. ఇందులో `దో పట్టి` అనే చిత్రాన్ని నిర్మిస్తుంది కృతి. ఇందులో కాజోల్‌ కూడా నటిస్తుండటం విశేషం. 
 

66

ఇదిలా ఉంటే కృతి.. ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నిజం లేదని ఓ సందర్భంలో స్పందించింది కృతి. అయితే వరుణ్‌ ధావన్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ప్రభాస్‌తో కృతి ప్రేమలో ఉందనే వార్తలకు బలం చేకూరింది. కానీ ఆయన ఏదో క్రేజీగా చేద్దామని అలా అన్నాడని, అదిప్పుడు పెద్ద రచ్చ అవుతుందని ఆమె వెల్లడించింది. అయితే తాము డేటింగ్‌లో లేమని మాత్రం ఇటు ప్రభాస్‌, అటు కృతి చెప్పకపోవడం గమనార్హం. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos