ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర 60వ పుట్టిన రోజు.. ఆమె సాధించిన ఘనతలు ఇవే!

First Published | Jul 27, 2023, 5:03 PM IST

ప్రముఖ సింగర్, మెలోడీ క్వీన్ కేఎస్ చిత్ర (KS Chithra) అభిమానులకు ఈరోజు ప్రత్యేక రోజు. ఇవాళ ప్రముఖ సింగర్ 60వ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ కోసం కొన్ని ఆసక్తికర విషయాలు..
 

ఆమె గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సాధించుకున్నారు.. మృదువైన గానంతో అవార్డులను కొల్లగొట్టారు. కొన్ని వేల పాటలు పాడి రికార్డులు క్రియేట్ చేశారు ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర. ఈరోజు చిత్ర గారి 60వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు, సంగీత ప్రియులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

కేఎస్ చిత్ర 1963 జూలై 27న జన్మించారు. కేరళలోని త్రివేంద్రంలో పుట్టి పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం కూడా పూర్తి చేశారు. 1979 నుంచి సింగర్ గా అవతారం ఎత్తారు. 40 ఏళ్లకు పైగా తన గాత్రాన్ని అందిస్తూ కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. భారతీయ భాషల్లో 18000 వేలకు పైగా పాటలు పాడి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 
 


కేరళకు చెందిన 'నైటింగేల్'గా ఎక్కువ పాటలను పాడిన సింగర్ గా రికార్డ్  చేయడంతో పాటు.. లెజెండరీ సింగర్స్ KJ యేసుదాస్, SP బాలసుబ్రహ్మణ్యం, AR రెహమాన్, ఇళయరాజా, హంసలేఖ, MM కీరవాణిలతో కలిసి పనిచేసిన సుదీర్ఘ చరిత్రకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు. 
 

కేఎస్ చిత్రను భారతీయ సినిమా 'మెలోడీ క్వీన్'గా కూడా పిలుచుకుంటారు. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆమెను గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఏషియానెట్ న్యూస్‌తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.  
 

ఆమె మాట్లాడుతూ..  రీసెంట్ గా తన కూతురు నందన పుట్టినరోజు జరుపుకున్నట్లు పేర్కొంది. ఇక చిత్ర అప్పుడప్పుడు కొంతమంది అభిమానుల నుండి పుట్టినరోజున సర్ ప్రైజ్ కేక్ అందుకున్నట్టు తెలిపారు. అలాగే ఓసారి ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తుండగా.. ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్ పోర్ట్ కు సమీపంలో తన భర్తతో స్టే చేసిందంట. ఆ మరుసటి రోజే తన పుట్టిన రోజని మరిచిపోయారంట. అప్పుడు తన అభిమాని వలర్మతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం ఎప్పడికి మరిచిపోలేనని తెలిపింది. 
 

అలాగే, తను సాధారణ విద్యార్థిని అని చెప్పింది. 10వ తరగతికి సంబంధించిన బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి అదనపు క్లాసులు కూడా అటెండె అయ్యినట్టు తెలిపారు. ఇక 
చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టమని చెప్పారు. తాను కూడా సంగీతం నేర్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు పేర్కొంది. ఆమె సంగీతంలో MA చదివి ఉంటే కచ్చితంగా సంగీత ఉపాధ్యాయుడిగా మారదానినని తెలిపారు. 
 

ఇక చిత్ర 16 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్,, 11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్,, 4 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 3 కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్,, 1 ఒరిస్సా స్టేట్ ఫిల్మ్ అవార్డు, 1 వెస్ట్ బెంగాల్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు. ఆరు వేర్వేరు భారతీయ రాష్ట్రాల నుండి 36 రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అలాగే ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ నుంచి అందుకున్నారు. భారతీయ సంగీత కమ్యూనిటీకి ఆమె చేసిన గణనీయమైన కృషికి, ఆమె 2005, 2021లో భారతదేశం మూడవ, నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ, పద్మభూషణ్‌లను అందుకున్నారు. 
 

Latest Videos

click me!